Advertisement
Google Ads BL

‘సరోవరం’ విడుదలకు సర్వం సిద్ధం


శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం ప్రీ రిలీజ్ ఈవెంట్. అక్టోబర్ 18న సరోవరం గ్రాండ్ రిలీజ్ 

Advertisement
CJ Advs

శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్.శ్రీలత మాట్లాడుతూ.. ‘‘సరోవరం సినిమాను అందరూ ఇష్టపడి తీసాము. మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు, మీడియా వారికి ధన్యవాదాలు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు. 

డైరెక్టర్ సురేష్ యడవల్లి మాట్లాడుతూ.. సరోవరం అనే గ్రామంలో జరిగిన కథ ఇది. ఎమోషనల్‌గా నడిచే ఈ కథలో మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హీరో, హీరోయిన్ బాగా నటించారు. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. అక్టోబర్ 18న ఈ సినిమాను థియేటర్స్ లో చూసి మమ్మల్ని దీవించండని తెలిపారు.

జబర్దస్త్ నవీన్, రాము మాట్లాడుతూ.. సరోవరం సినిమా అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగింది. మాస్ కు కావాల్సిన అంశాలతో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే ఎలిమేంట్స్ ఈ సినిమాలో ఉన్నాయన్నారు.

నటీనటులు:

విశాల్ వున్న

ప్రియాంక శర్మ

శ్రీలత

తనికెళ్ల భరణి

మేకా రామకృష్ణ

ఛత్రపతి శేఖర్

మహమ్మద్ ముస్తఫ

సంధ్య జనక్

మీనా కుమారి 

జబర్దస్త్ నవీన్

జబర్దస్త్ రాము

 

సాంకేతిక నిపుణులు:

కెమెరామెన్: మలహార్ భట్ జోషి

ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్

సంగీతం: సునీల్ కశ్యప్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు

ప్రొడ్యూసర్: ఎస్.శ్రీలత

కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సురేష్ యడవల్లి

Sarovaram Movie Ready to release:

Sarovaram Movie release on Oct 18
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs