Advertisement
Google Ads BL

శ్వేతా బసు మళ్లీ వచ్చేస్తోంది..మంచి రోజులొచ్చాయ్!


‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్వేతా బసు ప్రసాద్.. తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో ‘ఎకడా..’ అనే డైలాగ్‌ ఇప్పటికీ పాపులర్‌లోనే ఉంది. అలా ఈ హాట్ బ్యూటీ తొలి చిత్రంతోటే హిట్ అందుకోవడంతో ఇక ఈమెకు తిరుగులేదని అవకాశాలు కొదవుండదని అందరూ భావించారు. అయితే ఆశించిన విధంగా కాకుండా సీన్ మొత్తం రివర్స్ అవ్వడంతో శ్వేత ఇబ్బందుల్లో పడటం.. చివరికి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టు పడటం.. ఇలా ఈమెపై వ్యభిచారి అనే ముద్ర పడటంతో కొద్దిరోజుల పాటు సినిమాలకి దూరమైపోయింది.

Advertisement
CJ Advs

ఈ క్రమంలోనే శ్వేతా పెళ్లి చేసుకోవడం.. సినిమాలకు దూరం కావాలని భర్త చెప్పడంతో నటనకు గుడ్ బై చెప్పేసింది. అయితే.. తెలుగు సినిమాలకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు టాటా చెప్పేసిన శ్వేతా.. బాలీవుడ్‌ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ‘ది తాష్కెంట్ ఫైల్స్’ సినిమాలో నటించడం ఆమె ఓ వరంలా మారింది. ఈ ముద్దుగుమ్మ నటించిన ఈ సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. దీంతో శ్వేతాబసుకు మళ్లీ మంచిరోజులొచ్చేశాయ్ అని కుటుంబీకులు, ఆమె వీరాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు.. ఈమె పేరు ఇప్పుడు బీ టౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పెద్ద ఎత్తున వినిపిస్తుండటంతో మళ్ళీ తెలుగులోకి తీసుకొచ్చేందుకు కొందరు పేరుగాంచిన నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ కొందరు నిర్మాతలు శ్వేతను ఫలానా పాత్రల్లో నటించాలని సంప్రదిస్తున్నారట. ఏదైతేనేం శ్వేతకు మంచి రోజులొచ్చాయంటే ఆనందించదగ్గ విషయమే.

Good days come to Actress Swetha basu:

Good days come to Actress Swetha basu  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs