Advertisement
Google Ads BL

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’ రిలీజ్ డేట్!


నవంబర్ 15న సాయి పల్లవి ‘అనుకోని అతిథి’

Advertisement
CJ Advs

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనుకోని అతిథి’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అధిరన్’ కు తెలుగు అనువాదం. నవంబర్ 15న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘కేరళలో 1970లలో వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అని అన్నారు. 

ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌, కెమెరా: అను మోతేదత్‌, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, సంగీతం: పి.ఎస్‌. జయహరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీన్వాస్, సమర్పణ: శ్రీమతి దీప సురేందర్ రెడ్డి; నిర్మాతలు: అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్; దర్శకత్వం: వివేక్‌

Anukoni Athidhi Movie Release Date Fixed:

Sai Pallavi Anukoni Athidhi Movie Release on Nov 15
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs