Advertisement
Google Ads BL

ఇంటర్వ్యూ: డైరెక్టర్ శంకర్ (ఎవ్వరికీ చెప్పొద్దు)


రాఘవేంద్ర రావు గారి మాటలను ఎప్పటికి మర్చిపోలేను - ఎవ్వరికి చెప్పొద్దు డైరెక్టర్ శంకర్

Advertisement
CJ Advs

క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్‌ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై దిల్‌రాజు రిలీజ్ చేసాడు. ఎవ్వరికి చెప్పొద్దు అంటూ సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అందరికి చెప్పేంత మంచి సినిమాగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్, హీరోయిన్ గార్గేయిలు మీడియాతో ముచ్చటించారు. 

అసలు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?

క్యాస్ట్ గురించి వస్తున్న సినిమా కాబట్టి స్టోరీ చెప్పగానే నిర్మాతలు కథను, నన్ను నమ్మి ప్రాజెక్టుని ఓకే చేసేసారు. కానీ సినిమా డిలే అవుతుండటంతో వేరే ఫ్రెండ్ రాకేష్ గురించి చెప్పాడు తాను కూడా ఇలాగే బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడని. అలా రాకేష్ ని కలవడం, సినిమా చేయడం జరిగింది.

రాకేష్ గురించి..

రాకేష్ అందరిలా కాదు. తాను చాలా చాలా ఇంటెలిజెంట్ గా వర్క్ చేస్తాడు. ఏదైనా సినిమాలో క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసి.. ఆ క్యారెక్టర్ కి అనుగుణంగా తాను మారి, ఒక చిన్న డెమో లాంటిది రెడీ చేసుకుని అప్పుడు డైరెక్టర్ ని కలుస్తాడు.. అంత మంచి యాక్టర్ రాకేష్.

అసలు మీకు క్యాస్ట్ మీద సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? రియల్ లైఫ్ లో క్యాస్ట్ తో ఏమైనా ఇబ్బంది పడ్డారా?

క్యాస్ట్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్. కరెక్ట్ గా హేండిల్ చేయగలిగితే మంచి సినిమా అవుతుంది కదా అనిపించింది.  నా రియల్ లైఫ్ లో అంటే క్యాస్ట్ వల్ల పెద్దగా ఇబ్బంది పడింది లేదు కానీ ఈ సినిమాకి ఇన్సిపిరేషన్ మాత్రం నా ఫ్రెండ్. తనకి చాలా దారుణంగా బ్రేకప్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను మళ్ళీ రిలేషన్ జోలికి వెళ్ళలేదు. తన లైఫ్ ని చూసే ఈ సినిమా స్టోరీ రెడీ చేసుకున్నాను.

అసలు మీ సినీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది..? మీ మొదటి సినిమా ఏంటి ?

మొదటి సినిమా అంటే ఎన్నో ఏళ్ళ కిందటే చేసాను. ఇంకోసారి అనే సినిమా చేశా.. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు జాబ్ చేశాను. అసిస్టెంట్ ప్రొఫసర్ గా. తర్వాత బిస్కెట్, రన్ రాజా రన్, పెళ్లి చూపులు సినిమాలకి పని చేశా.. 

మీ నేటివ్ ప్లేస్..

బేసిక్ గా మా పేరెంట్స్ ది కృష్ణా జిల్లా. కానీ నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే.

హీరోయిన్ ని ఎలా సెలెక్ట్ చేశారు?

ఆడిషన్స్ లోనే. ఈ  రోల్ కోసం దాదాపు 150 మందిని ఆడిషన్ చేసాం. రోజుకి 7 -8 మంది కంటే ఎక్కువ ఆడిషన్ చేసేవాళ్ళం కాదు. అలా అంతమందిలో గార్గేయిని సెలెక్ట్ చేసాం..

గార్గేయిని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఏం స్పెషల్ ఉంది తనలో?

తనది క్లీన్ జాబ్. ఒక సరైన నటి కానీ, నటుడు కానీ దొరికితే మాత్రమే అది సాధ్యమవుతుంది. తన ఫొటోస్, కెమెరా వైపు చూసే విధానంలోనే తెలిసిపోయింది నాకు గార్గేయి గురించి. అలా తాను సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఇంకో సర్ప్రైజ్. తాను తెలుగు అమ్మాయి అవడం.. అది కూడా మాకు చాలా కలిసొచ్చింది.

ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?  

రాఘవేంద్ర రావు గారు ఫోన్ చేసి చాలా మంచి సినిమా చేసావు.. క్యాస్ట్ గురించి ఇలాంటి సినిమాని తీయగలగడం గొప్ప విషయం అని అభినందించారు. 

ఈ సినిమాలో పర్టికులర్ గా ఈ హీరోనే అని అనుకున్నారా?

అదేం లేదండి. కథ మొత్తం రాసుకున్నాక మంచి ఆర్టిస్ట్ దొరికితే చాలు అనుకున్న. లక్కిలీ నాకు రాకేష్ దొరికాడు. తాను మంచి యాక్టరే కాదు, మంచి అందగాడు, తెలివైన వాడు కూడా.

దిల్ రాజు రాకముందు, వచ్చిన తర్వాత ఏమైనా మార్పులొచ్చాయా సినిమాలో?

కొన్ని కొన్ని... దిల్ రాజు గారు మూవీ చూసిన వెంటనే ఇంత లెంగ్త్ వద్దని, ట్రిమ్ చేయమన్నారు. ఈయనకేం తెలుసు ఆయన ప్రొడ్యూసర్.. నా సినిమా నాకే తెలుస్తుంది. డైరెక్టర్ ని నేను అనుకున్నాను.. కానీ ఇవాళ రన్ టైం అనేది సినిమాకి చాలా ప్లస్ అయింది. అంతా ఆయన వల్లే.

Evvarikee Cheppoddu Director Shankar Interview:

Director Shankar Talks about Evvarikee Cheppoddu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs