Advertisement
Google Ads BL

కార్తీ ‘ఖైదీ’ని తెలుగులో రిలీజ్ చేస్తుంది ఆయనే!


కార్తీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’ని తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌

Advertisement
CJ Advs

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకుంటోంది.

ఈ సందర్భంగా యాంగ్రీ హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘‘ఈ దీపావళికి ‘ఖైదీ’ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో సాంగ్స్‌, రొమాన్స్‌ లేకుండా కేవలం యాక్షన్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండే డిఫరెంట్‌ మూవీ ఇది. ఈ మూవీని చూసి డెఫినెట్‌ గా అందరూ థ్రిల్‌ అవుతారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఖైదీని అందిస్తున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ... ‘‘రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వుండే సినిమా ఇది. పాటలు, హీరోయిన్‌ లేకుండా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సాగే వెరైటీ సినిమా ఇది. డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఫాదర్‌ అండ్‌ డాటర్‌ సెంటిమెంట్‌ కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. కార్తీ చేసిన ‘యుగానికొక్కడు’, ‘ఆవారా’, ‘నాపేరు శివ’, ‘ఊపిరి’, ‘ఖాకీ’ వంటి డిఫరెంట్‌ సినిమాల తర్వాత వస్తున్న మరో విభిన్నమైన సినిమా ఇది. కార్తీ సినిమాల్లోనే ‘ఖైదీ’ ఓ వైవిధ్యమైన సినిమా అవుతుంది. సినిమా ప్రారంభం నుంచే చాలా ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌పై ‘ఖైదీ’ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌, రిలీజ్‌: శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌.

KK Radhamohan Releases Khaidi in Telugu States:

Sri Sathya Sai Arts Bagged Khaidi Telugu Rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs