Advertisement
Google Ads BL

ఉత్తేజ్ స్కూల్ నుంచి 2 బ్యాచ్‌లు బయటకు..!


ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ నిర్వహిస్తున్న “మయూఖా టాకీస్’’ 

Advertisement
CJ Advs

యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు( అక్టోబర్ 15) ఫిలిం ఛాంబర్లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, యువ నిర్మాత రాహుల్ యాదవ్, దర్శకనిర్మాత లక్ష్మీకాంత్,  మయూఖా టాకీస్  ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఉత్తేజ్, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నట శిక్షణ పూర్తి చేసుకున్న రెండు బ్యాచ్ ల యాక్టింగ్ స్టూడెంట్స్ కు దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి  సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా తొలుత తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘నటుడుగా, రైటర్ గా, కవిగా, వక్తగా 30 సంవత్సరాల అద్భుతమైన ప్రస్థానంలో తనను తాను గొప్పగా తీర్చిదిద్దుకున్న ఉత్తేజ్ ఇప్పుడు ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభించి తెలుగు తెరకు కొత్తతరం నటీనటులను అందించే ప్రయత్నం చేయటం అభినందనీయం. నటుడిగా తనకున్న అపారమైన అనుభవమే ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇప్పటికి రెండు బ్యాచ్ లుగా నట శిక్షణ పొంది వీడ్కోలు తీసుకుంటున్న స్టూడెంట్స్ కు మంచి అవకాశాలు వస్తున్నట్లుగా తెలిసింది. వారికి నా అభినందనలు. కొత్త బ్యాచ్ కి ఆల్ ద బెస్ట్’’ అన్నారు.

దర్శకుడు తేజ మాట్లాడుతూ.. ‘‘ఉత్తేజ్ తో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. నేను అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసిన ‘రావుగారిల్లు’ చిత్రానికి తను అసిస్టెంట్ గా పనిచేశాడు. అంటే దాదాపు 30 ఏళ్లకు పై నుండి తెలుసు. సినిమారంగంలో తన  అనుభవాన్నoతటినీ వినియోగించుకుంటూ ఈ రోజున ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించినoదుకు కంగ్రాట్స్.  ఒక నటుడు నటనలో ట్రైనింగ్ తీసుకుంటే అతని నటన, ప్రవర్తన, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటాయో? తీసుకోకపోతే ఎలా ఉంటాయో? శివాజీ గణేషన్, కమలహాసన్, రజినీకాంత్, చిరంజీవి, శ్రీదేవి వంటి మేటి నటులతో తన అనుభవాలను ఉదహరిస్తూ దర్శకుడు తేజ చెప్పిన సంఘటనలు స్టూడెంట్స్ కు చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి.’’

దర్శకుడు సురేందర్ రెడ్డి  మాట్లాడుతూ.. ‘‘ఫిలిం ఇనిస్టిట్యూట్లో తాము ఎంచుకున్న శాఖలో ట్రైనింగ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో చెప్పటానికి నా కెరీరే ఉదాహరణ. హైదరాబాద్ వచ్చి లక్డికాపూల్ లో ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న తరువాత నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను తీసుకున్న శిక్షణ నాకు ఎంతో ఉపయోగపడింది. అలాగే ఉత్తేజ్ గారు ప్రారంభించిన మయూఖ టాకీస్ నటులుగా ఎదగాలనుకుoటున్న మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్ టు మయూఖ టాకీస్..’’ అన్నారు.

యువ నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో నేను నిర్మించే చిత్రాలలో మయూఖ టాకీస్ స్టూడెంట్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను’’ అన్నారు.

మరో దర్శక నిర్మాత లక్ష్మీకాంత్.. ‘‘మయూఖ టాకీస్ లో శిక్షణ పొందుతున్న వీళ్లందరికీ గొప్ప భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతం నేను నిర్మిస్తున్న కొత్త చిత్రంలో ఇద్దరు మయూఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కుర్రాళ్లకు అవకాశం ఇచ్చాను’’ అన్నారు. 

ఉత్తేజ్ మాట్లాడుతూ.. “మయూఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభ సమయంలో దీని విజయావకాశాల మీద కొంతమంది మిత్రులు

వ్యక్తం చేసిన సందేహాలు, సంశయాలు అన్నీ ఈ రెండు బ్యాచ్ ల సూపర్ సక్సెస్ తో తొలగిపోయాయి. ఈ విజయానికి సహకరిస్తున్న నా ఫ్యాకల్టీకి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహణను నేను ఒక చాలెంజ్ గా తీసుకున్నాను తప్ప ఏదో ఆషామాషీ వ్యాపకంగా తీసుకోలేదు. మా మయూఖ టాకీస్ తొలి సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన టాప్ డైరెక్టర్స్ తేజ గారికి, సురేందర్ రెడ్డి గారికి, మామిడి హరికృష్ణ గారికి ఇతర మిత్రులందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.

Certificate Presentation from Uttej Mayukha Talkies:

Uttej Mayukha Talkies Certificate Presentation Event Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs