రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదే హీరోస్ రెమ్యూనరేషన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈమూవీ కోసం ఎంత తీసుకుంటున్నారు అనే విషయం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం ఒక్కొక్కరికి రామ్ చరణ్ - తారక్ లకు 30 కోట్లు పైగా ముడుతోందని ప్రచారమైంది. ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం వారికి ఇదే మొదటిసారి ఏమో. రాజమౌళి సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అవుతుంది కాబట్టి తారక్ అండ్ చరణ్ ఇద్దరు రెమ్యూనరేషన్ విషయంలో తగ్గట్లేదు అంట.
భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లిస్ట్ లోకి మరో స్టార్ హీరో కూడా చేరాడు. ఆయనే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. ఇందులో దేవగన్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందట. అందుకే ఆయన ఏకంగా 35కోట్ల పారితోషికం డిమాండ్ చేసారని వినిపిస్తోంది. రెమ్యూనరేషన్ కి తగ్గట్టే ఆయన పాత్ర ఉంటుందని... పాత్ర పరిధి అంతే ఇదిగా ఉంటుందట. ఇలా ముగ్గురు ప్రధాన స్టార్లకు ఇచ్చే పారితోషికాలే 100 కోట్లు ఉంటే ఇంకా సినిమా బడ్జెట్ ఎంతో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి తోడు రాజమౌళి ప్యాకేజీ యెంత ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. ఒకరకంగా ఇది భారీ బడ్జెట్ అయ్యే అవకాశముంది. త్వరలోనే జక్కన్న రామ్ చరణ్ పై షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.