Advertisement
Google Ads BL

సమంత యాక్షన్‌లోకి దిగుతోంది


ఇండియాలో ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే వెబ్ సిరీస్. ప్రతి భాషలో వెబ్ సిరీస్ లు ట్రెండ్‌ పెరిగిపోతున్నాయి. దాంతో చాలామంది స్టార్స్ ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒక పక్కన సినిమాల్లో నటిస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత కూడా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement
CJ Advs

ప్రస్తుతం వరస హిట్స్ తో టాలీవుడ్ లో చెలరేగిపోతున్న సామ్ త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించబోతుంది. రాజ్‌ అండ్ డీకే దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌, ప్రియమణి, మనోజ్‌ బాజ్‌పాయ్‌ మెయిన్ పాత్రల్లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ మంచి హిట్ అయింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండు సీజన్ ని ఇంకా జాగ్రత్తగా ఇంకా మంచి కాస్టింగ్ తో తీయాలని మేకర్స్ సామ్ ని తీసుకున్నట్టు అర్ధం అవుతుంది.

సామ్ కూడా ఈ వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే సామ్ సెకండ్ సీజన్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుందని టాక్. అంతే కాదు సమంత భారీ స్టంట్స్ చేస్తూ యాక్షన్ సన్నివేశాల్లో నటించబోతుందట. అందుకోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ కూడా తీసుకుంటుందని సమాచారం. త్వరలోనే ఈమెపై షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

Samantha Role in The Family Man Web series:

Samantha in to Action with The Family Man web series
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs