Advertisement
Google Ads BL

పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు: ఆలీ


1100 పైగా చిత్రాల్లో నటించిన కమిడియన్ ఆలీ లేటెస్ట్‌గా నటించిన రాజు గారి గది 3 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆలీతో ఇంటర్వ్యూ...

Advertisement
CJ Advs

నేను ఇప్పటివరకు చేసిన చిత్రాలు ఒక ఎత్తు ఈ రాజు గారి గది 3 మరో ఎత్తు. అన్నీ ఎమోషన్స్ ఉన్న పాత్ర నాకు ఇచ్చారు ఓంకార్. తాను మొదట నాకు కాల్ చేసి నైట్ ఎఫెక్ట్‌లో ఎక్కువ సినిమా ఉంటుంది. ఈ రోల్ మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పడంతో కథవిన్నాను. సబ్జెక్ట్ బాగా నచ్చి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడం జరిగింది.

రాజు గారి గది 1, 2 లో అశ్విన్ చేసిన పాత్రలకు ఈ సినిమాలో తను చేసిన పాత్రకు చాలా మార్పులు ఉన్నాయి. ఈ మూవీలో ఫుల్ లెన్త్ రోల్ లో అశ్విన్ ప్రేక్షకులను అలరిస్తాడు. తనకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా నటుడిగా మరో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది.

ఓంకార్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ప్రతి సన్నివేశాన్ని తనకు ఎలా కావాలో అలా రాబట్టుకొనే సత్తా ఉన్న దర్శకుడు. పక్కా ప్లానింగ్ తో సినిమాను ఫినిష్ చేసాడు. మొదటి రెండు పార్ట్స్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తీసాడు. ముఖ్యంగా కెమెరామెన్ చోటా కె నాయుడు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. తనకు ఈ జానర్ సినిమా కొత్త, తన విజువల్స్ తో సినిమాను మరో స్థాయికి తీసుకొని వెళ్ళాడు.

నూతన సంగీత దర్శకుడు షబ్బీర్ ఈ సినిమాకు మంచి రీరికార్డింగ్ ఇచ్చాడు. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన వెంకటేష్... షబ్బీర్ చేసిన మ్యూజిక్ గురించి అభినందించారు. బుర్రా సాయి మాధవ్ మాటలు ఈ సినిమాకు మరో హైలెట్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తన మాటలకు థియేటర్‌లో నవ్వులే నవ్వులు. ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా డిటీఎస్ మిక్సింగ్ చేసిన వ్యక్తి.. చూసిన ప్రతిసారి నవ్వుతూనే ఉన్నానని నాకు చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఆడియన్స్‌ను ఎలా నవ్వించబోతోందో. రాజు గారి గది 3 సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు ఖచ్చితంగా నవ్వి నవ్వి ఎంజాయ్ చేస్తారు. ఓంకార్ ఆయన తమ్ముళ్లు కళ్యాణ్, అశ్విన్ పడ్డ కష్టానికి దేవుడు కచ్చితంగా ఈ సినిమా రూపంలో సక్సెస్ ఇస్తాడు.

నాకు బాగా నచ్చిన కమెడియన్స్‌లో బ్రహ్మానందం, మల్లికార్జున, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏ.వి.ఎస్, ఎమ్.ఎస్.నారాయణ. వీరంతా రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి కమెడియన్స్ అయ్యారు. ఎక్కడ కామెడీ ఉంటే బాగుంటుంది, ఎక్కడ తగ్గిస్తే బాగుంటుంది వీరికి బాగా తెలుసు కనుకే ఇండస్ట్రీలో గొప్ప కమెడియన్స్‌గా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు మన నుండి ఆశించే నటనను మనం ఇవ్వాలి. నేను ఎప్పుడూ ఎక్కడా డైరెక్టర్‌ను ఇబ్బంది పడేలా చెయ్యలేదు. ప్రేక్షకులు ‘వీడు నవ్విస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు’ ఇలా అన్ని చెయ్యగలగుతున్నాడని ఎవరినైతే అనుకుంటాడో వాడే గొప్ప నటుడు’’ అని ఆలీ తెలిపారు.

Ali talks about Raju Gari Gadhi 3 Movie:

Ali Interview about Raju Gari Gadhi 3 Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs