తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన సైరా చిత్రం.. నార్త్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడడంలేదు. బాలీవుడ్‌లో ఈమూవీ డిజాస్టర్‌గా ముగిసింది. 10 రోజుల థియేట్రికల్ రన్‌ని పూర్తి చేసుకున్న సైరా కథ నార్త్‌లో దాదాపు ముగిసినట్టే అని చెబుతున్నారు అక్కడ ట్రేడ్ ఎనలిస్ట్‌లు.
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సైరాను నార్త్‌లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈమూవీ అక్కడ కేవలం 10 రోజుల్లో 7 కోట్ల నెట్ మాత్రమే దక్కించుకుంది. మహా అయితే మరో కోటి రూపాయలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 8 కోట్లు లోపే ఈసినిమా నార్త్‌లో సాధించే అవకాశం ఉంది. సో.. సైరా బాలీవుడ్‌లో దుకాణం సర్దేసినట్లే అనేది అర్ధం అవుతుంది.
అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరో నటించినప్పటికీ ఈసినిమా కేవలం 7 కోట్ల నెట్ మాత్రమే వసూళ్లు చేసింది అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.