Advertisement
Google Ads BL

సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్ ఫిక్స్!


సంక్రాంతి కానుకగా జనవరి 12న  ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సూపర్ స్టార్ మహేష్  ‘సరిలేరు నీకెవ్వరు’.

Advertisement
CJ Advs

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా...

సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ  -  ‘‘ఈ సంక్రాంతి పండుగ నాకు బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ స్పెషల్’’ అన్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ దిల్‌రాజు మాట్లాడుతూ  - ‘‘సంక్రాంతి కానుకగా జనవరి 12న  ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.’’ అన్నారు.

అగ్ర నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ  -  ‘‘జనవరి 12 నుండి  ‘సరిలేరు నీకెవ్వరు’  మీ హృదయాలను జయించి మీలో నవ్వుల్ని పూయిస్తుంది. యాక్షన్‌తో  మిళితమైన 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్‌ను మేము ప్రామిస్ చేస్తున్నాము’’ అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ‘‘సరిలేరు నీకెవ్వరు’ చూసి  వచ్చే సంక్రాంతికి  మీరంతా నవ్వకుండా, చప్పట్లు కొట్టకుండా, ఈలలుతో గోల చేయకుండా ఉండలేరు’’ అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ  - ‘‘క్యాలెండర్‌లో  డేట్ మార్క్ చేసుకోండి. జనవరి 12న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Sarileru Neekevvaru Release Date Fixed:

Sarileru Neekevvaru Movie Release on JAN 12th, 2020
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs