Advertisement
Google Ads BL

‘సాహో’ హీరోతో ‘సైరా’ డైరెక్టర్‌.. నిజమేనా!?


‘సైరా నర్సింహారెడ్డి’ సినిమా భారీ హిట్ కావడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరిప్పుడు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. ‘సైరా’ తర్వాత సురేందర్ ఏం చేయబోతున్నాడు..? మళ్లీ చిరుతోనే సినిమా తీస్తాడా..? లేకుంటే కాస్త గ్యాపిచ్చి నిదానంగా కథ చూసుకుని పట్టాలెక్కిస్తాడా..? లేకుంటే రీమేక్ సినిమా కానిచ్చేస్తాడా..? అనేది ఇప్పుడు సినీ ప్రియుల్లో .. సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Advertisement
CJ Advs

ఈ క్రమంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘జాన్’ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత సురేందర్-ప్రభాస్ కాంబోలో సినిమా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘సైరా’ కంటే ముందే ప్రభాస్‌తో సినిమా చేయాలని భావించిన సురేందర్‌కు ఇప్పుడు కాస్త టైమ్ దొరకడంతో ఓ క‌థ‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. 

అయితే ప్రభాస్‌తో పాటు కుర్ర హీరో నితిన్ పేరు.. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ కూడా సురేందర్ చేతిలోనే ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చూస్తే సురేందర్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడటన్న మాట. మరి ఈ వార్తల్లో నిజానిజాలెంతున్నాయో.. ఆఖరికి సురేందర్ ఏం ట్విస్ట్ ఇస్తాడో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచిచూడాల్సిందే మరి.

‘Sye Raa’ director to work with Prabhas?:

‘Sye Raa’ director to work with Prabhas?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs