టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరని అడిగితే ఒకప్పుడు అందరూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ క్రిటిక్ కత్తి మహేశ్ అని చెప్పేవారు.. కానీ ఇప్పుడు వీళ్లిద్దరూ సైలెంట్ అయ్యేసరికి ఆ స్థానాన్ని వివాదాస్పద, హాట్ నటి శ్రీరెడ్డి ఆక్రమించేసింది. సమయం, సందర్భం లేకుండా తనకు సంబంధంలేని విషయాల్లో వేలుపెట్టి మరీ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలువురు హీరోలు, హీరోయిన్స్‌పై లేనిపోని వ్యాఖ్యలు చేసిన ఈ శ్రీరెడ్డి.. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ హీరోయిన్ రోజాపై దారుణమైన కామెంట్స్ చేసింది.
ఇటీవల తన ఫేస్ బుక్‌లో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక నటితో ఎఫైర్ ఉందంటూ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సదరు నటి భర్తను సైతం వదలకుండా ఫొటోలతో సహా తన సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదాన్ని రాజేసింది. ఇప్పుడు అదే నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో రోజా క్యారెక్టర్ గురించి నీచమైన కామెంట్స్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.
అంతటితో ఆగని శ్రీరెడ్డి.. ‘రోజా గారు మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. మిమ్మల్ని కించపరచాలని నాకు లేదు కానీ.. నిజం చెప్పాలనేదే మాత్రమే నా ఈ ప్రయత్నం. మీ రచ్చబండ లేదా బతుకు జడ్కా బండికి వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తాను’ అంటూ మరో పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. మరి శ్రీరెడ్డి చేసిన ఈ పోస్ట్‌లో నిజానిజాలెంత అనేది పెరుమాళ్లకే ఎరుక. అయితే హాట్ నటి కామెంట్స్‌ను రోజా లెక్కచేస్తారా..? లేదా అరటి తొక్కలాగా తీసి పారేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.