చిరంజీవి - కొరటాల శివ సినిమాలో చరణ్ కూడా నటిస్తున్నాడు అని క్లారిటీ వచ్చేసింది. ఇందులో చిరు రెండు షేడ్స్‌లో కనిపిస్తాడు అని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చిరు ఒక్క పాత్రలోనే కనిపించనున్నాడని.. మరోపాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడని అర్ధం అవుతుంది.
ఈమూవీలో చిరు యంగ్ గా కనిపించే పోర్షన్‌ని చరణ్ చేస్తాడని సమాచారం. అరవై అయిదేళ్ల వయసులో పాతికేళ్ల యువకుడిగా కనిపించడం చిరంజీవికి ఇబ్బందిగా వుంటుంది. అందుకే చరణ్ అండ్ చిరు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరి దీన్ని ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది తెలియదు.
ఎందుకంటే చిరు, చరణ్ లకి పోలికలు తక్కువ. మరి చరణ్ పెద్దయ్యి చిరంజీవి అయ్యాడనేది ఎంతవరకు యాక్సప్టబుల్ అనేది తెరపై చూస్తే కానీ తెలియదు. ఇక ఈమూవీ నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. వచ్చే సంవత్సరం ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.