Advertisement
Google Ads BL

‘సైరా’ దర్శకుడి తదుపరి చిత్రం ఈ హీరోతోనేనా?


రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా చిత్రంగా ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. మళ్లీ ప్రభాస్ కి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావాలంటే మళ్లీ అతను రాజమౌళితో వర్క్ చేయాలి. కానీ అది అంత ఈజీగా అయ్యేపని కాదు. రాజమౌళి మళ్లీ ఇప్పటిలో ప్రభాస్ తో చేసే అవకాశం లేదు.

Advertisement
CJ Advs

అయితే రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు ఎవరు అని ప్రభాస్‌ టీమ్‌ బాగా అన్వేషిస్తోంది. అప్పుడు వారి ద్రుష్టిలో సైరా దర్శకుడు సురేందర్‌ పడ్డాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి అంత భారీ బడ్జెట్‌ చిత్రాన్ని, అంతటి భారీ తారాగణాన్ని బాగా హ్యాండిల్‌ చేయడంతో పాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించి అన్ని బాగా హేండిల్ చేసాడని... సో అతనితో ప్రభాస్ కి సినిమా పడితే బాగుంటుందని భావిస్తున్నారు.

ఈ విషయాన్నీ యువి క్రియేషన్స్‌ వారు కూడా అంగీకరించారట. ప్రభాస్ తో జేమ్స్‌బాండ్‌ తరహా యాక్షన్‌ చిత్రం చేస్తే తనకి నేషనల్‌ వైడ్‌గా మంచి గుర్తింపు వస్తదని యువి వాళ్ళు భావిస్తున్నారు. ఆల్రెడీ ఇదే విషయాన్నీ సురేందర్ రెడ్డికి చెప్పినట్టు ఆయన కొంత సమయం తీసుకుని కథ రెడీ చేసుకుని తీసుకుని వస్తా అని చెప్పడం జరిపోయాయి అని తెలుస్తుంది. అన్ని కుదిరితే ‘జాన్’ తరువాత వీరి కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశముందని సమాచారం.

Prabhas, Surender Reddy Film On Cards:

Is Prabhas Bowled By Sye Raa?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs