Advertisement
Google Ads BL

చరణ్, ఎన్టీఆర్‌.. ‘RRR’కు సహకరించడం లేదా?


రాజమౌళి దర్శకత్వంలో కొమరమ్ భీం - అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల వలన భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్‌కి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నట్లుగా ఫిలింసర్కిల్స్‌లో టాక్ వినబడుతుంది. RRR షూటింగ్ మొదలెట్టాక ఎన్టీఆర్, చరణ్‌కి గాయాలవడంతో.. బ్రేకిచ్చిన షూటింగ్ తర్వాత ఎన్టీఆర్ సీన్స్‌తో బాగానే జరిగింది. అయితే రామ్ చరణ్ సైరా సినిమా ప్రమోషన్స్‌తో బిజీ అవడంతో... మళ్లీ రాజమౌళి RRR‌కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

Advertisement
CJ Advs

ఇక సైరా సినిమా విడుదలైంది చరణ్ ఫ్రీ అవుతాడనుకుంటే... మళ్ళీ చిరు - కొరటాల సినిమా మొదలెట్టాడు. ఇక చరణ్ అలా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా రాజమౌళికి చెప్పి షూటింగ్‌కి బ్రేక్ తీసుకున్నాడట. మరి ఇలా షూటింగ్‌కి వెళ్లకపోతే సినిమా అనుకున్న టైంకి విడుదలవుతుందా? అనేది ప్రస్తుతానికున్న అతి పెద్ద ప్రశ్న. రాజమౌళి వ్యవహారంలో స్టార్ హీరోలెవరూ ఇలా చెయ్యరు. కానీ పరిస్థితులు అనుకూలించకపోతే ఎవరేం చేస్తారు. కాకపోతే రాజమౌళి తనకున్న డేట్స్‌ని పక్కాగా వాడుకుంటాడు కానీ.. అశ్రద్ధ చేసే టైప్ కాదు. కానీ హీరోలు సహకరించాలిగా!

Break to RRR Movie Shooting:

Ram Charan and Jr NTR Not Supports to RRR Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs