Advertisement
Google Ads BL

ప్రేక్షకులు ఇలా అయితే.. ఇక సినిమాలు కష్టమే!


ఒకప్పుడు ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే అదో పండగలా ఉండేది. అభిమానులు చేసే గోల, తన అభిమాన నటుడు గురించి వారు చేసే హంగామా అన్ని ఒక పండగలా ఉండేది. పండగల టైములో సినిమాలు రిలీజ్ చేసుకుని డబ్బులు కాష్ చేసుకుంద్దాం అనుకునేవాళ్లు ప్రొడ్యూసర్స్. ఏదన్నా పండగ వచ్చిందట బంధుమిత్రులతో జనమంతా థియేటర్లకు వెళ్లి సరదాగా గడిపేవారు. థియేటర్స్ జనాలతో బంధుమిత్రులతో జనమంతా థియేటర్ల ముందు ఈగల్లా మూగేవారు. కానీ కొన్ని ఏళ్ళ నుండి ఆ వాతావరణం కనిపించడం లేదు. ఒకప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు లేదు.

Advertisement
CJ Advs

బ్లాక్ బస్టర్ అనుకున్న చిత్రాలు కూడా పండగ రోజు థియేటర్స్ లో ఈగలు తోలుకునే గత్యంతరం ఏర్పడింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ అందులో ముఖ్యంగా ఇంట్లో కూర్చుని అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. జీ 5 లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్స్. వీటి వల్ల జనాలు అసలు థియేటర్స్ కి రావడమే తగ్గించారు. బయటకు వచ్చి థియేటర్ లో చూసే బదులుగా చక్కగా ఇంట్లో కూర్చునే ఈ సైట్స్ లో లేటెస్ట్ సినిమాలు చూసేస్తున్నారు. యువతరం అయితే పూర్తిగా స్మార్ట్ ఫోన్ - ల్యాప్ టాప్ లలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వందల కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే జనాలు మాత్రం టీవీలకు అతుక్కుపోవడం మేకర్స్ ని విస్మయానికి గురిచేస్తోంది.

దీనికి తోడు ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా బాగా ఊపు అందుకున్నాయి. దాంతో థియేటర్లన్నీ పండగ వేళ వెలవెల బోతున్నాయి. సైరా లాంటి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ అందుకున్న సినిమా కూడా పండగ రోజు థియేటర్స్ లో ఈగలు తోలుతున్న పరిస్థితి నిశ్చేష్ఠపరిచింది. మరి అసలు ఇలానే ఉంటే సినిమా మనుగడ కష్టమేనా? దీనికి ఎలా బ్రేక్ లు పడతాయి?

Audience Mindset Changed on Movies:

Sye Raa Movie Hit.. But No Collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs