ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ లాంటి చిత్రాలలో సహా నటిగా నటించిన హిమజ బిగ్ బాస్ షో నుండి ఆఫర్ రావడంతో వెంటనే వెళ్లిపోయింది. వెళ్లిన రెండు రోజులకే హేమని ఎదిరించి తనకంటూ సపోర్టర్స్ ని ఏర్పరుచుకుంది. కానీ కొన్ని రోజులకే తన ఉనికి చాటుకోలేక సపోర్టర్స్‌ని కోల్పోతూ వచ్చింది. మిగిలిన హౌస్ మేట్స్ తో పెద్దగా కలవని హిమజ చాలా త్వరగానే హౌస్ నుండి వెళ్లిపోయింది. తనకు పునర్నవి బిహేవియర్ నచ్చట్లేదు అని పలుమార్లు చెప్పింది.
బయటకు వచ్చిన హిమజ బాగానే రచ్చ చేసింది. బిగ్‌బాస్‌పై, నాగార్జునపై కూడా ఆమె సెటైర్లు వేసింది. హౌస్ లో వుండే తోటి కంటెస్టెంటుల విషయాలు.. వారి బుద్ది ఏంటో ఎండగట్టింది. హౌస్ లో జరిగినవి చాలా చూపించలేదని బిగ్ బాస్ టీం కావాలనే కొంతమందిని హైలెట్ చేస్తున్నారు అని చెప్పింది. ఇక రీసెంట్ గా హౌస్ నుండి పునర్నవి ఎలిమినేట్ అయితే తీన్‌మార్ డాన్స్ చేస్తూ వీడియో కూడా పెట్టింది. అంత పైశాచిక ఆనందం ఏంటో అని కామెంట్స్ వేస్తున్నారు.
హిమజకు దక్కిన పాపులారిటీతో ఆమెని షాప్ ఓపెనింగ్స్‌కి ఇన్వయిట్ చేస్తున్నారు. ఈమెకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగింది. ఏదిఏమైనా హిమజకు బిగ్ బాస్ పాపులారిటీ తెచ్చిపెట్టింది.