Advertisement
Google Ads BL

‘అప్పుడు-ఇప్పుడు’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల


దసరా శుభాకాంక్షలతో ‘అప్పుడు-ఇప్పుడు’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Advertisement
CJ Advs

యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అప్పుడు-ఇప్పుడు’. చలపతి పువ్వల దర్శకుడు. సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. శివాజీరాజా, ‘మళ్లీ రావా’ ఫేమ్ పేరుపు రెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో కన్పించనున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దసరా పండుగా సందర్భంగా ‘అప్పుడు-ఇప్పుడు’ ఫస్ట్ లుక్‌ని విడుదలచేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ.. ‘‘మీ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడం హ్యాపీ‌గా ఉంది. మంచి కంటెంట్‌తో వస్తోన్న ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. సుజన్, తనీష్క్ ఇద్దరు చాలా బాగా నటించారు. అందరూ కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మా నిర్మాతలు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్ర విజయంపై మా టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘విజయదశమి రోజున మా చిత్రం ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా దర్శకుడు చలపతి పువ్వల కొత్తవారైనా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమా కోసం ఎంతో ఇష్టంగా వర్క్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు.

సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ...

కెమెరా: కల్యాణ్ సమి,

ఆర్ట్: ఠాగూర్,

ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,

సంగీతం: పద్మానావ్ భరద్వాజ్, 

నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు, 

దర్శకత్వం: చలపతి పువ్వల.

Appudu Ippudu Movie First Look Released:

Vijaya Dasami Special: Appudu Ippudu Movie First Look Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs