Advertisement
Google Ads BL

ఆ సినిమాల్ని ‘సైరా’ ఎప్పటికి క్రాస్ చేయాలి?


సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించుకుంది కానీ ఓవర్సీస్ లో ఈ సినిమా  పరిస్థితి చూస్తుంటే మాత్రం అంత ఆశాజనకంగా లేదు. అక్టోబర్ 2 న రిలీజ్ అయిన ఈ మూవీ నిన్నటితో 5 రోజులు పూర్తి చేసుకుంది. నిన్నటితో ఈ మూవీ 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. అది కూడా ప్రీమియర్స్ తో కలుపుకొని.

Advertisement
CJ Advs

మరో మిలియన్ అంటే 3 మిలియన్స్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందా చేరదా అనేది ఆసక్తికరంగా మారింది. వీకెండ్ నిన్నటితో ముగిసింది. ఇక ఈరోజు నుండి ఈ సినిమా నిలదొక్కుకుంటుందా లేక వసూళ్లు మరింతగా తగ్గుతాయా అనే విషయం మరో రెండు రోజుల్లో తెలిసిపోనుంది. పైగా అక్కడ వార్ సినిమాతో సినిమాతో పాటు జోకర్ సినిమా కూడా ప్రేక్షక ఆదరణ పొందింది. దాంతో ఆ రెండు సినిమాల ఎఫెక్ట్ సైరాపై పడింది. సైరాకి మరో మైనస్ ఏంటంటే కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల టొరంటో, కెనడాలోని కొన్ని మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయడం జరిగింది. ఇది సైరాకు పెద్ద దెబ్బ.

చిరు తన గత చిత్రం ఖైదీ నంబర్ 150ను కూడా సైరా క్రాస్ చేయడం కష్టంలా ఉంది. ఓవర్సీస్ లో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమా లిస్ట్ ప్రకారం చూస్తే సైరా కంటే ముందు నాన్నకు ప్రేమతో, అజ్ఞాతవాసి, ఫిదా, ఎఫ్-2, అరవింద సమేత ఉన్నాయి. మరి వాటిని సైరా ఎప్పటికి దాటేను?

Tough Competition to Sye Raa at Overseas:

Sye Raa Collections: US Slows Down
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs