Advertisement
Google Ads BL

టాప్ నిర్మాత మెచ్చిన ‘రాజావారు రాణిగారు’


కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఎస్‌. ఎల్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా9 పతాకాలపై మనోజ్‌ వికాస్‌ డి., మీడియా 9 మనోజ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌ ద్వారా ప్రజలకు చేరువైంది. విడుదలైన మూడు పాటలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర పోస్టర్, పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డి. సురేష్ బాబు, ప్రముఖ నటి శ్రియాశరన్, మాళవిక శర్మ, తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ తదితరులు పాల్గొన్నారు

Advertisement
CJ Advs

అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ.. మనసులోని ప్రేమని ఎన్ని రకాలుగా చెప్పవచ్చో అనే అంశంతో తీసిన సినిమా ఇది. నాకు ఎంతో నచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఓ అనుభూతికి గురవుతారని అంటే, ‘ప్రేమమ్‌’ తర్వాత అంతటి గాఢత కనిపించిన సినిమా ఇదేనని దర్శకుడు, హీరో తరుణ్‌భాస్కర్‌ అన్నారు.

చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్లకు తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే చిత్రమిది. పట్నంలో ఉన్నవాళ్లకు పల్లెటూరు ఎలా ఉంటుందో రెండుగంటల్లో కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించే చిత్రమిది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.. అన్నారు.

హీరో మాట్లాడుతూ.. మల్లీశ్వరి సినిమాను మా కుటుంబంతో చూశాం. ఈ రోజు మా సినిమాకు సురేష్‌బాబుగారు సపోర్ట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. 21 సంవత్సరాల కుర్ర నిర్మాత మా చిత్రాన్ని నిర్మించడం మరింత సంతోషం. దర్శకుడు రవి అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు.

శ్రియ మాట్లాడుతూ.. సురేష్‌బాబుగారు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు అంటే చాలు.. ఈ సినిమా చాలా గొప్ప సినిమా అయ్యి ఉంటుందనిపిస్తుంది. విడుదల తర్వాత మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నాను.. అంటే, మరో హీరోయిన్ మాళవిక శర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి విన్నాను చాలా చక్కగా చేసారని తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుంది అంటేనే సినిమా హిట్ అని లెక్క.. చక్కటి పల్లెటూరి ప్రేమకథగా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను.. అన్నారు

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు ఆంధ్రలోని పల్లెటూర్లకి వెళ్ళాను. చాలా చక్కగా ఉంటాయి. మళ్లీ సిటీ అలవాటు అయ్యాక పెద్దగా వెళ్ళలేదు. ఈ సినిమా చూస్తే నాకు అన్ని గుర్తొచ్చాయి. ఈ సినిమా చూసిన అందరికీ వాళ్ళ అమ్మమ్మగారి ఇల్లు గుర్తుకువస్తాయని ఖచ్చితంగా చెప్పగలను.. అని అన్నారు.

దర్శకుడు: రవి కిరణ్ కోల

మ్యూజిక్: జయ్ క్రిష్

ప్రొడ్యూసర్స్: మనోవికాస్.డి, మీడియా 9 

Rajavaru Ranigaru New Poster and Song Launched:

Suresh Babu Presents Rajavaru Ranigaru Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs