Advertisement
Google Ads BL

నయనతార ‘వసంతకాలం’ను తెస్తోంది


‘వసంతకాలం’ను తోడ్కొని వస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార

Advertisement
CJ Advs

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌ను ‘వసంత కాలం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహించారు.

5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై ఇంతకుముందు ‘ఏకవీర, వెంటాడు-వేటాడు’ వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగి, ఇటు మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’లో మెప్పించి..  అటు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘దర్బార్’లో జత కడుతున్న నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటడ్ చిత్రం ‘వసంతకాలం’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘వసంతకాలం’ ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటోంది. నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నయనతార నటన-గ్లామర్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, చక్రి తోలేటి దర్శకత్వం, భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ తదితరుల పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధించి..  నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుతుందనే నమ్మకముంది..’’ అన్నారు.

Nayanthara Starring Vasantha Kalam Movie Update:

Nayanthara Vasantha Kalam Movie Release on November
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs