Advertisement
Google Ads BL

కాన్సెప్ట్ బేస్డ్ కథతో ఆనంద్ దేవరకొండ చిత్రం


‘దొరసాని’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హీరో ఆనంద్ దేవరకొండ నటించబోయే మూడో సినిమా అనౌన్స్ అయింది. ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్‌లో ఉన్న ఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి (యూ.ఎస్.ఏ) బ్యానర్‌పై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం అనౌన్స్ మెంట్ జరిగింది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ.. ‘‘పలు షార్ట్ ఫిలింస్‌తో ఆకట్టుకున్న దామోదర అట్టాడ ఓ మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో వచ్చాడు. ఈకథ హీరో ఆనంద్ దేవరకొండ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ లుక్ కూడా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. త్వరలోనే వాళ్ల పేర్లు ప్రకటిస్తాం.ఈ సినిమాతో ముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.

టెక్నికల్ టీమ్:

పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా

సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా

మ్యూజిక్: అమిత్ దాసాని,సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల

ఆర్ట్: నీల్

నిర్మాతలు: విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి

రచన-దర్శకత్వం: దామోదర అట్టాడ.

Anand Deverakonda 3rd Film Details:

Anand Deverakonda Selected Concept Based Story for his 3rd film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs