రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఇద్దరు స్టార్ హీరోల కలయికలో తెరకెక్కుతున్న RRR సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా మొదలైనప్పటినుండి సినిమా మీద అంచనాలు కాదు... ఆసక్తి పెరిగిపోతుంది. అల్లూరు సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కథపై చాలామంది చాలా రకాల డౌట్స్‌తో ఉన్నారు. అదేమిటంటే అసలు కొమరం బీమ్, అల్లూరి విడివిడిగా పోరాటాలు చేశారు. కానీ వీరిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు? ఈ సినిమాలో అసలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబో సీన్స్ ఉంటాయా? ఉంటే అవి ఎప్పుడు ఉంటాయనే డౌట్స్ లో ఎన్టీఆర్, మెగా.. ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే తాజాగా వినబడుతున్న కథ ప్రకారం RRR సినిమాలో ఎన్టీఆర్ ఒక చిన్న పాపని కాపాడడానికి పెద్ద సాహసం చేస్తాడని.. ఆ ఎపిసోడ్ సినిమాకే కీలకం అని.. ఆ పాపను కాపాడిన క్రమంలోనే రామ్ చరణ్ అల్లూరి పాత్ర ఎన్టీఆర్ కొమరం భీం తో చేతులు కలిపి పోరుబాట పడతారని అంటున్నారు. అలాగే మొదటినుండి వినబడుతున్న న్యూస్ ప్రకారం ఆ పాపను కాపాడే క్రమంలో ఎన్టీఆర్ పులితో కూడా ఫైట్ చేస్తాడని అంటున్నారు. ఇక సినిమాలో సందర్భానుచితంగా కేవలం నాలుగు పాటలకు మాత్రమే చోటుంటుంది అని అంటున్నారు.