తమిళ నటుడు ధనుష్ తన కెరీర్ స్టార్టింగ్ నుండే విభిన్న చిత్రాలు చేస్తూ వచ్చాడు. ఈనేపధ్యంలో లేటెస్ట్ గా ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో అసురన్ అనే సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి ఆట నుండే పాజటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పుడుతున్నారు. వెక్కై అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
ఇందులో ధనుష్ 20 ఏళ్ల కుర్రాడికి తండ్రిగా, యువకుడిగా రెండు పాత్రల్లో నటించాడు. ఇక ధనుష్ కి భార్యగా మలయాళ సీనియర్ నటి మంజువారియర్ నటిచింది. ఓ ఆసామి కారణంగా ప్రమాదంలో పడిన తన ఫ్యామిలీని శివస్వామి( ధనుష్ ) ఎలా కాపాడుకున్నాడు అనేదే సినిమా కథ.
ఈ సినిమాలో ధనుష్ నటన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ పాత్రలకు నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందని కామెంట్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరో హైలెట్. తెలుగులో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. మరి తన ఫ్యాన్స్ భావిస్తున్నట్టుగా ధనుష్ కి నేషనల్ అవార్డు వస్తుందో రాదో చూడాలి.