Advertisement
Google Ads BL

‘సాహో’, ‘సైరా’ ఫెయిల్.. మళ్లీ రాజమౌళినే కొట్టాలి!


రాజమౌళి బాహుబలిని పాన్ ఇండియా మూవీగా విడుదల చెయ్యడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్లాడు. పలు భాషల్లో బాహుబలి ప్రమోషన్స్ విషయంలో కానీ, అలాగే సినిమాని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చెయ్యడంలో కానీ... జక్కన్న వేసిన ప్లాన్ ఎవరికీ సాధ్యం కాదు. బాహుబలి మ్యానియాతో బాహుబలిని కొట్టేద్దామని ప్రభాస్ చేతులు కాల్చుకున్నాడు. సాహో సినిమాకి పక్కా ప్రమోషన్స్ ఉన్నాయి. బాహుబలిని మించి బడ్జెట్ ఉంది. అయినప్పటికీ.. సాహో సినిమా కేవలం యాక్షన్ తో కూడుకుని ఉండడంతో.. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కానీ బాహుబలి మాస్, ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ గా ఎక్కడంతో సినిమా సక్సెస్ అయ్యింది. ఇక తాజాగా వచ్చిన సై రా నరసింహారెడ్డి సినిమా కూడా బాహుబలి కొట్టడానికి వచ్చింది. భారీ బడ్జెట్, చారిత్రాత్మక కథ, కళ్ళు చెదిరే వీఎఫెక్స్‌లు. కాకపోతే బాహుబలి అలాంటి ప్రమోషన్స్‌కి సైరాకి లేవు. బాహుబలి ప్రమోషన్స్‌లా సైరాకి పక్కా ప్లానింగ్ ప్రమోషన్స్ లేవు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకు సైరా సినిమా ఎక్కలేదు.

Advertisement
CJ Advs

మరి ఫైనల్‌గా బాహుబలి కొట్టే సత్తా మళ్ళీ జక్కన్నకే ఉందనిపిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి చెయ్యబోయే RRR సినిమాతో జక్కన్న బాహుబలి కొట్టడం ఖాయంగా కనబడుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నేషనల్ స్టార్స్ కాకపోయినప్పటికీ... వారి హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ సినిమాని డైరెక్ట్ చెయ్యగలడు. అలాగే RRR సినిమా ప్రమోషన్స్‌ని జక్కన్న పక్కాగా ప్లానింగ్ తో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగలడు. రాజమౌళి ప్లానింగ్ స్ట్రాటజీ ఎవరికీ లేదనేది రెండు భారీ బడ్జెట్ సినిమాలతో తేలిపోయింది.

Saaho and Sye Raa Failed to beat Baahubali:

That Chance Only To Rajamouli with RRR Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs