Advertisement
Google Ads BL

‘మనం సైతం’ ఆధ్వర్యంలో తలసాని బర్త్‌డే వేడుక


తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు వేడుకలను మనం సైతం సేవా సంస్థ ఘనంగా నిర్వహించింది. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ సారథ్యంలోని ఈ సంస్థ తలసాని పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక వీడియో ఆల్బమ్ రూపొందించారు. మంత్రి చేతుల మీదుగా ఈ పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు శ్రీధర్ రెడ్డి, సురేష్, అనిల్ కుమార్, బందరు బాబీ, కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేక్ ను కట్ చేసి తలసాని శ్రీనివాస యాదవ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సినీ కార్మికుల్లోని ఇద్దరు ఆపన్నులకు మంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. 

Advertisement
CJ Advs

అనంతరం మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘36 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో అనేక కష్టాలు ఎదుర్కొని నిలబడ్డాను. తలసాని శ్రీనివాస యాదవ్ అన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయ్యాక ఆయన ఇచ్చిన ధైర్యంతో నాకో అండ దొరికినట్లు భావించాను. మనం సైతం పెట్టిన గత ఐదేళ్లుగా ఆయన ప్రతి పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆయన ప్రజాసేవపై ప్రత్యేక వీడియో ఆల్బమ్స్ రూపొందిస్తున్నాం. ఈ పుట్టిన రోజుకు కూడా మంచి పాట రూపకల్పన చేశాం. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తలసాని గారు మాకు ఇస్తున్న ప్రోత్సాహం మర్చిపోలేము..’’ అన్నారు.

Manam Saitham Celebrates Talasani Birthday :

Talasani Srinivas Yadav Birthday Celebrated by Manam Saitham Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs