Advertisement
Google Ads BL

‘అసలు ఏంజరిగిందంటే’ ఫస్ట్ లుక్ విడుదల


వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా ‘అసలు ఏంజరిగిందంటే’ ఫస్ట్ లుక్ లాంచ్

Advertisement
CJ Advs

బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో మెప్పించిన మహేంద్రన్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అసలు ఏంజరిగిందంటే’. సూపర్‌స్టార్ రజినీకాంత్, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్‌తో వైవిధ్యమైన పాత్రల్లో నవ్వులు పండించాడు మహేంద్రన్. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో జి.ఎస్. ఫిల్మ్స్ బ్యానర్, నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో అత్యంత బిజీ హీరోగా ఎన్నో అత్యద్భుతమైన పాత్రల్ని పోషించిన విజయ్ సేతుపతి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ తనదైన శైలిలో మెప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి వెర్సటైల్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ‘అసలు ఏంజరిగిందంటే’ ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ.. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా ‘అసలు ఏంజరిగిందంటే’ చిత్రం ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసినందుకు విజయ్ సేతుపతిగారికి మా యూనిట్ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలనటుడిగా ఎన్నో వందల చిత్రాల్లో మనల్ని ఎంటర్‌టైన్ చేసిన మహేంద్రన్ నా దర్శకత్వంలో తెరకెక్కిన అసలు ఏం జరిగిందంటే చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతుండడం సంతోషంగా ఉంది. వైవిధ్యమైన ఈ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్, హరితేజ, షఫి, ఫణి, షాని, కుమ్నన్ సేతురామన్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లక్షీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ గా చేసిన విజయ్ కుమార్ గారు ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. చరణ్ అర్జున్ అందించిన పాటలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. కర్ణ సినిమాటోగ్రఫీ విజువల్ బ్యూటీతో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేస్తాం..’’ అని అన్నారు.

Asalu Yem Jarigindante First Look Released:

Vijay Sethupathi Released Asalu Yem Jarigindante First Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs