Advertisement
Google Ads BL

హిట్టు కాన్సెప్ట్ తో గోపీచంద్-సంపత్ నంది చిత్రం!


ఈమధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది. అదే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు. టాలీవుడ్ లో ఈమధ్య నాని జెర్సీ వచ్చి మంచి టాక్ దక్కించుకుంది. ఈ సినిమా తరువాత అంతా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈనేపధ్యంలో వరుణ్ తేజ్ కూడా ఒక స్పోర్ట్స్ డ్రాప్ లో సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాడు. కిరణ్ అనే కొత్త దర్శకుడితో వరుణ్ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు.

Advertisement
CJ Advs

అలానే గోపీచంద్ కూడా క్రీడా నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం అతను నటించిన చాణిక్య ఈరోజు రిలీజ్ అయింది. ఈసినిమా తరువాత గోపి... సంపత్ నంది డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు. సమంతతో ‘యు టర్న్’ సినిమా తీసిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బేనర్ మీద శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. రెండు రోజులు కిందట ఈసినిమా  ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా సంపత్ నంది  మాట్లాడుతూ....

ఇందులో గోపీచంద్ ఆంధ్రా కబడ్డీ కోచ్ గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ గా నటించనున్నారని వెల్లడించాడు.  ఇది  పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని... కొన్ని నెలలు పాటు కబడ్డీకి సంబందించిన కోచ్ లని కలిసి ఎంతో పరిశోధన చేసి ఈ కథ తయారు చేసినట్లు సంపత్ వెల్లడించాడు.

Hit Concept to Gopichand and Sampath Nandi Movie:

Gopichand and Sampath Nandi Movie Storyline Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs