కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ధృవ లాంటి కమర్షియల్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి చేతిలో చారిత్రాత్మక చిత్రాన్ని పెడితే.. ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నారు. అసలు సురేందర్ రెడ్డి సై రా నరసింహారెడ్డి సినిమాకి డైరెక్టర్ అనగానే షాకయినవాళ్లు ఉన్నారు, పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు. అయితే సై రా మేకింగ్ వీడియోస్, ట్రైలర్ విడుదలయ్యాకే సురేందర్ రెడ్డి సత్తా చాలావరకు బయటికి వచ్చింది. తాజాగా సై రా సినిమా కూడా హిట్ టాక్ తో థియేటర్స్ దుమ్ము దులుపుతుంది. సురేందర్ రెడ్డి తన శక్తిమేర సై రా సినిమా కోసం కష్ట పడ్డాడు.
యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించడంలోనూ, పాత్రలను మలిచిన తీరుని, చిరులోని హీరోయిజాన్ని చూపించడంలోనూ సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు మెచ్చేలా కాదు.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా సై రా నరసింహారెడ్డిని తెరకెక్కించాడు. మరే బ్లాక్ బస్టర్ లాంటి సినిమాని తియ్యకపోయినా... సురేందర్ రెడ్డి శక్తిమేర సినిమాని ప్రేక్షకులు ఆకట్టుకునేలా తియ్యగలిగాడు. బాహుబలితో రాజమౌళికి ఎంత పేరొచ్చిందో.. అంత పేరు సురేందర్ రెడ్డికి రాదుకాని... తాజాగా అన్ని భాషల హీరోల చూపు ఇప్పుడు ఈ సై రా దర్శకుడు సురేందర్ రెడ్డి మీదే పడింది.