డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వెంకీ మామ. వెంకటేష్ - నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఈ దసరాకే రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాలు వల్ల ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. మొదటిలో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈసినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి రాకపోవడానికి కారణమేంటా? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.
అందులో మొదటిది.... ఈచిత్రం షూటింగ్ అప్పుడు వెంకీ గాయపడడం ఒక కారణం అయితే మరొకటి ఈమూవీ కాన్వాసు అంతకంతకు పెరుగుతోంది. తొలుత అనుకున్న బడ్జెట్ ని ఈమూవీ ఎప్పుడో క్రాస్ చేసి 55కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేశారని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజం అయితే వెంకీ అండ్ చైతు కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రం అవుతుందని చర్చ సాగుతోంది.
సినిమా కథ దేశభక్తి నేపథ్యం.. నాగచైతన్య పాత్రలో ట్విస్టులు వగైరా ఆసక్తికరంగా ఉంటాయట. నిర్మాతలు బడ్జెట్ ని ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్న కుదరట్లేదు. వెంకీ- చైతన్య రేంజును మించి బడ్జెట్ పెట్టడం సాహసమే అవుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఈమూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుందని తెలుస్తుంది.