Advertisement
Google Ads BL

బెల్లంకొండ గణేష్ డెబ్యూ చిత్రం మొదలైంది


బీటెల్ లీఫ్ ప్రొడక్షన్ మరియు లక్కీ మీడియా బ్యానర్స్‌లో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం

Advertisement
CJ Advs

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ బీటెల్ లీఫ్ ప్రొడక్షన్ మరియు లక్కీ మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దిల్ రాజు, సురేష్ బాబు, జెమినీ కిరణ్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, MLA జీవన్ రెడ్డి, చంటి అడ్డాల, రాజ్ కందుకూరి, మిరియాల రవీందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత దిల్ రాజు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వివి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వి. వి.వినాయక్ మాట్లాడుతూ.. ‘‘నన్ను బెల్లంకొండ సురేష్‌గారు దర్శకుడిగా పరిచయం చేశారు. వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్‌ను నేను హీరోగా పరిచయం చేశాను. ఇప్పుడు సురేష్‌గారి చిన్నబ్బాయి గణేష్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉంది. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో గణేష్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని భావిస్తున్నాను. నాకు నచ్చిన టెక్నీషియన్స్ రథన్, కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. బ్రోచేవారెవరురా సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు మాటలు రాయడం విశేషం. యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి ముందుగా అంద‌రూ చాలా మంచి టెక్నీషియ‌న్స్ కుదిరారు. నేనే మా అబ్బాయిని లాంచ్ చేద్దామ‌నుకున్నా కానీ బెక్కం మంచి క‌థ‌తో వ‌చ్చాడు. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్’’ అని అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘పవన్ సాధినేని చెప్పిన కథ నచ్చడంతో ఏడాది నుండి మేము ఈ కథ మీద వర్క్ చేస్తున్నాము. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక నిర్మాత బెల్లంకొండ సురేష్ గారిని కలిసి కథ చెప్పాము. సురేష్ గారికి కథ నచ్చింది. గణేష్ అయితే ఈ సినిమాకు బాగుంటాడని గణేష్‌కు కథ చెప్పాము. అందరికి కథ నచ్చడంతో ముందుకెళ్లాము. ఈ సినిమాను మరింత గ్రాండ్ గా ప్రెజెంట్ చెయ్యడానికి బీటెల్ లీఫ్ ప్రొడక్షన్ వారు ముందుకొచ్చారు, వారికి థ్యాంక్స్ తెలుపుతున్నాను. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత సురేష్‌గారికి, దిల్ రాజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు.

హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండడానికి కారణం మా నాన్న బెల్లంకొండ సురేష్ గారు. నన్ను ఎపుడూ సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్‌కు రుణపడి ఉంటాను. అన్నయ్య సాయి శ్రీనివాస్ నన్ను ఒక బ్రదర్ కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఒకరోజు నాన్న నాకు ఈ కథ వినమని చెప్పడంతో విన్నాను. కథ విన్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. మంచి కథతో నా దగ్గరికి వచ్చిన బెక్కం వేణు గోపాల్, పవన్ సాధినేనిగార్లకు ధన్యవాదాలు. కార్తిక్ ఘట్టమనేని, రధన్ మా సినిమాకు వర్క్ చెయ్యడం, వివేక్ ఆత్రేయ మాటలు రాయడం హ్యాపీగా ఉంది..’’ అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నా కళ్లముందు పెరిగిన నా తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతుండడంతో సంతోషంగా ఉంది. నేను ఈ కథ విన్నాను, బాగా నచ్చింది. మంచి సబ్జెక్ట్‌తో గణేష్ హీరోగా లాంచ్ అవ్వడం హ్యాపీగా ఉంది. నిర్మాత బెక్కం వేణు గోపాల్‌గారికి మిగిలిన టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలువుతున్నాను’’ అన్నారు.

డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ.. ‘‘బ్యూటిఫుల్ లవ్ స్టొరీతో మీ ముందుకు వస్తున్నాము. గణేష్ ఈ కథకు కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు నన్ను నమ్మి ఈ సినిమా చేస్తున్నందుకు ధన్యవాదాలు. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న బెల్లంకొండ సురేష్ గారికి స్పెషల్ థాంక్స్. రథన్ మ్యూజిక్, కార్తిక్ ఘట్టమనేని కెమెరావర్క్ ఈ సినిమాకు ఆదనవు ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలుపుతాము..’’ అన్నారు.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ‘‘పవన్ సాధినేని రాసుకున్న ఈ కథ బాగుంది. కథ నచ్చి మాటలు రాయడం జరిగింది. గణేష్ ఈ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని భావిస్తున్నాను. నిర్మాత బెక్కం వేణు గోపాల్ గారికి చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అన్నారు.

హీరో: బెల్లంకొండ గణేష్

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: పవన్ సాధినేని

బ్యానర్: బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ మరియు లక్కీ మీడియా

నిర్మాత: బెక్కం వేణు గోపాల్

డైలాగ్స్: వివేక్ ఆత్రేయ

సంగీతం: రథన్

కెమెరామెన్: కార్తిక్ ఘట్టమనేని

ఆర్ట్ డైరెక్టర్: గాంధీ

పి.ఆర్.ఓ: వంశీ శేఖర్

Bellamkonda Ganesh Movie Launched:

Bellamkonda Ganesh Movie Opening Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs