Advertisement
Google Ads BL

గోపీచంద్, సంపత్ నంది చిత్రం మొదలైంది


మ్యాచోస్టార్‌ గోపీచంద్‌, తమన్నాజంటగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ భారీ చిత్రం ప్రారంభం.

Advertisement
CJ Advs

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం అక్టోబర్‌ 3న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హై బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ముహూర్తపు షాట్‌కి సూపర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్‌ కొట్టగా, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్‌రామ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలోభారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌, అగ్ర నిర్మాత అనీల్‌ సుంకర, ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్‌, యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

మ్యాచోస్టార్ గోపీచంద్‌ మాట్లాడుతూ - ‘‘శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ శ్రీనివాస్‌గారితో, పవన్‌గారితో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేస్తున్నాను. వాళ్లు నాకు చాలాకాలంగా తెలుసు. కొన్ని స్టోరీస్‌ అనుకున్నాం కానీ.. ఈ స్టోరి బాగా పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ఒక మంచి స్టోరితో, మంచి సినిమా చేయాలనే తపన ఉన్న ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌తో సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ‘గౌతమ్‌ నంద’ తర్వాత సంపత్‌ ఒక సూపర్‌ స్క్రిప్ట్‌తో వచ్చారు. మళ్ళీ సంపత్‌తో వర్క్‌ చేయడం హ్యాపీ. తమన్నాతో ఫస్ట్‌టైమ్‌ సినిమా చేస్తున్నాను. మా ఇద్దరి కాంబినేషన్‌ స్క్రీన్‌మీద బాగుంటుందని అనుకుంటున్నాను. తనది కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్‌. ఆమె కూడా చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. డిఓపి సౌందర్‌ రాజన్‌ ‘గౌతమ్‌ నంద’ లో చాలా బాగా చూపించారు. మంచి టీమ్‌తో, అద్భుతమైన కథతో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.’’ అన్నారు.

మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది మాట్లాడుతూ - ‘‘ఈరోజు ఈ మూవీ లాంచ్‌ అవడానికి 1 టు 10 రీజన్స్‌ మా హీరో గోపీచంద్‌గారే. ఫస్ట్‌టైమ్‌ నేను ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా చేస్తున్నాను. దానికోసం చాలా రీసెర్చ్‌ చేశాను. గోపీగారు ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తున్నారు. తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. 25 మంది బ్యూటిఫుల్‌ ప్లేయర్స్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. బలమైన కథతో, విజువల్స్‌తో, ఎమోషన్స్‌తో ఫస్ట్‌టైమ్‌ ఈ కథ చేస్తున్నాను. ఈ కథ చేయడానికి నా వెనకాల ఉన్న బలం చిట్టూరి శ్రీనివాస్‌, పవన్‌గారు. శ్రీనివాస్‌గారికి మాట ఇస్తున్నాను. మీ బేనర్‌లో పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుందని. అలాగే గోపీచంద్‌గారి ఫ్యాన్స్‌ గర్వంగా చెప్పుకునే సినిమా చేస్తాను’’ అన్నారు.

మిల్కీబ్యూటి తమన్నా మాట్లాడుతూ - ‘‘సంపత్‌నందిగారితో నా మూడో సినిమా. మంచి కంటెంట్‌ ఉన్న సబ్జెక్ట్‌. గోపీచంద్‌గారితో సినిమా చెయ్యాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి మంచి టీమ్‌తో మంచి కథ కుదిరినందుకు హ్యాపీగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాస్‌, పవన్‌గార్లకి థాంక్స్‌. సంపత్‌గారితో వర్క్‌ కంఫర్ట్‌గా ఉంటుంది. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌. తప్పకుండా ఒక హార్ట్‌ఫెల్ట్‌ సినిమా అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ - ‘‘గోపీచంద్‌గారితో సినిమా చెయ్యాలని గత 8 ఏళ్లుగా అనుకుంటున్నాను. ఎన్నో కథలు విన్నాం. కానీ సెట్‌ అవ్వలేదు. ఈ కథ విన్న వెంటనే షూటింగ్‌కి ఎప్పట్నుంచి రమ్మంటారు అని అడిగారు. అంతలా హీరోగారికి ఈ కథ నచ్చడం హ్యాపీ. డైరెక్టర్‌ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. తమన్నాగారు కూడా కథ విని అలాగే స్పందించారు. మా టీమ్‌ అందరం ఎంతో ఇష్టంగా కసితో చేస్తున్నాం. అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. నవంబర్‌ నుండి షూటింగ్‌ స్టార్ట్‌ ఏప్రిల్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సమర్పకులు పవన్‌ కుమార్‌, డిఓపి సౌందర్‌ రాజన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ నాయర్‌ పాల్గొన్నారు.

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్‌ రాజన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌ నంది.

Sampath Nandi and Gopichand Movie Launched:

Sampath Nandi and Gopichand Movie Opening Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs