బాహుబలి తర్వాత హిందీ ప్రేక్షకులకు తెలుగు సినిమాలు పిచ్చగా నచ్చేస్తున్నాయి. తెలుగులో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తేనే.. అక్కడ భారీ హిట్ అవుతున్నాయి. తాజాగా బాహుబలి క్రేజ్ తో విడుదలైన సాహో సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ... బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం సాహో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురిపించారు. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయనే ఒక్క కారణంతోనే సాహో సినిమాని అక్కడ హిట్ చేసారు. ప్లాప్ టాక్ కే పట్టం కట్టిన బాలీవుడ్ జనాలు.. హిట్ టాక్ వస్తే ఊరుకుంటారా...
బుధవారం విడుదలైన సై రా నరసింహారెడ్డి సినిమాకి ప్రేక్షకులు హిట్ టాక్ ఇచ్చారు. సై రా సినిమాకి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ నాలుగు భాషల ప్రేక్షకులు హిట్ టాక్ ఇవ్వడం కాదు.... బాలీవుడ్ లో కూడా సై రా సినిమాకి హిట్ టాక్ పడింది. మరి ప్లాప్ టాక్ పడిన సాహోనే ఎత్తిన హిందీ ప్రేక్షకులు, సైరాని ఏ రేంజ్ హిట్ చేస్తారో అనేది చూడాలి. సైరా సినిమాకి బాలీవుడ్ లో వార్ సినిమా పోటీ ఉన్నప్పటికీ... వార్ ని వదిలేసి.. సై రా ని మెచ్చుకునే పనిలో ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా ఉన్నారు. చిరు ఆరు పదుల వయసులో పడ్డ కష్టాన్ని, చిరు స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ, ఎనర్జీని బాలీవుడ్ క్రిటిక్స్ ఎత్తడంతో.. సైరా సినిమా హిందీలో రికార్డులు కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.