Advertisement
Google Ads BL

ఇంటర్వ్యూ: శ్రీనివాస్ అవసరాల


1. ఊరంతా ఏమనుకుంటున్నారు..?

Advertisement
CJ Advs

సైరా చాలా బాగుంది అంటున్నారు.. (నవ్వుతూ)

2. మీ సినిమా ఊరంతా గురించి.. ఏమనుకుంటున్నారు 

మంచి కుటుంబ కథా చిత్రం అండీ.. చాలా రోజుల తర్వాత వస్తున్న ఫ్యామిలీ ఫిల్మ్. కొన్ని రోజులుగా అమ్మాయిలు, అబ్బాయిలు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఈ చిత్రం దానికి ముందు ఎలా ఉండేది అనేది చూపిస్తున్నాం. సంప్రదాయాల్ని గౌరవించే ఓ కపుల్ కథే మా ఈ చిత్రం.

3. సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది..?

నాది సినిమాలో తమిళ అబ్బాయి పాత్ర. అతడు ఓ సంగీత కళాకారుడు. ఈ ఊరు అమ్మాయిని ప్రేమించి ఇక్కడికి వస్తాడు. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను.. నాక్కూడా వాళ్ళంతే చెప్పారు(నవ్వుతూ)..

4. ట్రైలర్ చూస్తుంటే ఎవరు ఎవర్ని ప్రేమిస్తున్నారనేది కన్ఫ్యూజన్ ఉంది..?

నిజానికి ఇది సినిమాలో చాలా కీలకమైన కథ. దాని గురించి చెప్పకూడదు. పెళ్లి అనేది ఇద్దరి అభిప్రాయం కాదు.. రెండు కుటుంబాలు.. రెండు ఊళ్లకు సంబంధించిన విషయం.. అందరి అభిప్రాయాలు ముఖ్యం అని మన సంప్రదాయాలను చూపించే జంట కథ ఇది.

5. మీ సినిమా ఈ టైమ్‌కు సంబంధించిందేనా..?

హా.. ఇప్పటి సినిమానే.. కరెంట్ జనరేషన్ కథే.. కాకపోతే వ్యాల్యూస్ కొంచెం ఎక్కువగా ఉంటాయంతే.

6. ఈ సినిమాలో కన్ఫ్యూజన్ కామెడీ ఉంటుందా..?

ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదండీ. పైగా ఇది కామెడీ సినిమా కూడా కాదు. సెన్సిటివ్ ట్రెడీషనల్ స్టోరీ ఇది..

7. హాస్య నటుడిగా పరిచయం అయ్యారు.. విలన్‌గా చేసారు.. ఇందులో ఎలా ఉండబోతుంది..?

ఇందులో నేను కూడా ఓ హీరోనే.. రెండు జంటల్లో నాది ఓ జంట. ఇంకోటి నవీన్‌ది.. రెండు కథలు ప్యారలల్‌గా నడుస్తుంటాయి..

8. ఓ రోల్ వచ్చినపుడు ముందు ఏం చూస్తారు..?

బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తాను (నవ్వుతూ).. అలా ఏం కాదండీ.. అష్టా చెమ్మా తర్వాత చాలా వరకు అలాంటివే వచ్చాయి. కానీ అలా చేస్తే ఇరుక్కుపోతానేమో అని చాలా తక్కువ చేసా.. ఆ తర్వాత పిల్ల జమీందార్, ఒక్కక్షణం, రాజా చేయి వేస్తే లాంటి సినిమాలు చేసాను. అంతరిక్షంలో కూడా చిన్న పాత్రే. చిన్నా పెద్దా అని చూడకుండా నా పాత్ర ఎంతవరకు బాగుంటుంది కథలో అనేది ఆలోచిస్తాను. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ముఖ్యం కాదు.. మ్యూచివల్ అండర్ స్టాండింగ్‌తో సినిమాలు చేస్తాను. ఒక్కోసారి కథ నచ్చితే ఫ్రీగా కూడా నటిస్తాను. మొన్న మిడిల్ ఫింగర్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా ఇలాగే నటించాను.

9. మీకు ఓ కథ చెప్పినపుడు మీలోని డైరెక్టర్, రైటర్ నిద్రపోతాడా.. లేచే ఉంటాడా..?

లేదండీ.. ఫస్ట్ రెండు రోజులు అయితే కచ్చితంగా లేచే ఉంటాను. ముందు మనం ఏ కథ ఒప్పుకుంటున్నాం అనేది మనకు తెలియాలి.. ఆ జడ్జిమెంట్ నాలెడ్జ్ ఉండాలి. నిజానికి మన యాక్టర్స్ అంతా కూడా స్క్రీన్ రైటింగ్ నేర్చుకోవాలి. నాకు ట్రైనింగ్‌‌లో అదే చెప్పారు. ఇప్పుడు అంతా అది నేర్చుకుంటున్నారు కూడా. బాలీవుడ్‌లో కంగన రనౌత్ లాంటి వాళ్లు అలాగే స్క్రీన్ రైటింగ్ నేర్చుకుని డైరెక్షన్ కూడా చేస్తున్నారు.. అది వేరే విషయం. ఇక నా విషయానికి వస్తే కథ చెప్పిన తర్వాత జడ్జిమెంట్ నాలెడ్జ్ వరకు నాలోని రైటర్ లేచే ఉంటాను. ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత కమిట్మెంట్ ఇస్తే ఇక రైటర్, డైరెక్టర్ వంతు.

10. ఆర్టిస్టులకు మొత్తం కథ చెప్తున్నారా లేదా..?

ఒకప్పుడు చెప్పేవాళ్ళు కాదండీ.. ఇన్ని రోజులు డేట్స్ కావాలనే వాళ్లు అంతే. కానీ ఇప్పుడు అలా కాదు. డైరెక్టర్స్, రైటర్స్ మంచి ఆలోచనలతో వస్తున్నారు. ఆర్టిస్టులకు స్క్రిప్ట్ మొత్తం చెబుతున్నారు. 4, 5 ఏళ్లుగా అంతా మారుతుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను బాగా సిద్ధం చేసుకుంటున్నారు.

11. శ్రీనివాస్ అవసరాల ఉంటే సినిమా బాగుంటుంది అనే నమ్మకం జనాల్లో ఉంది.. దీనిపై మీ కామెంట్..

కొందరు యాక్టర్లు ఉంటే బాగుంటుంది అనుకోవడం సహజమే. నాకు అలా ఉంటే సంతోషమే. అది కొంతవరకు నిజమే అండీ.. కానీ నేను కూడా చెత్త సినిమాలు చేసాను.. అయినా ప్రేక్షకులు మంచోళ్లు అందుకే నన్ను క్షమించారు.

12. ఓ సినిమా ఫ్లాప్ హిట్ అవుతుందని ఎలా అంచనా వేస్తారు..?

ఫ్లాప్ హిట్ అని ఏ యాక్టర్ వేయలేడండి.. కథపై జడ్జిమెంట్ ఉండాలంతే. మనం ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అష్టా చమ్మా చేస్తున్నపుడు ఏం ఆలోచించలేదు.. ఆడుతూ పాడుతూ చేస్తే బ్లాక్ బస్టర్ అయింది.. ఓహో ఇలా ఆడుతూ పాడుతూ చేస్తే హిట్ అవుతుందనుకుంటే నెక్ట్స్ రెండు సినిమాలు రిలీజ్ రోజే వర్కవుట్ అవ్వలే.. కానీ హిట్ అవుతుందని చాలాసార్లు క్యారీ అవుతాం అంతే.. నేను లేకపోతే సినిమా పరిస్థితి ఏంటి అని యాక్టర్స్ ఆలోచించినపుడే విజయం వస్తుంది.. కానీ అలా ఆలోచించడం కష్టం.

13. దర్శకుడిగా ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు..?

డైరెక్టర్‌గా గ్యాప్ ఏం లేదండీ.. నేను ఒక్క సినిమా రాయడానికి టైమ్ తీసుకుంటాను అంతే. ఇప్పటికే ఓ సినిమా స్టార్ట్ అయింది.. సగం అయిపోయింది కూడా. అయితే సగం ఇండియా, సగం అమెరికాలో ఉండటంతో వీసా సమస్యలు వచ్చి ఆలస్యం అయింది అంతే. జనవరి, ఫిబ్రవరి లోపు అన్నీ పూర్తి చేస్తాను. టైటిల్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.. నాగశౌర్య, మాళవిక నయ్యర్ నటిస్తున్నారు.

14. దర్శకుడిగా మారడం వల్ల మంచి క్యారెక్టర్స్ మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ వస్తుందా..?

మంచి క్యారెక్టర్లు మిస్ అవుతున్నాం అనేది ఎప్పుడూ రాలేదు.. నిజానికి అది నాకు హెల్ప్ చేస్తుంది కూడా. డైరెక్టర్‌గా లేకపోతే ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ నాకు యాక్టింగ్ ఉంది.. డైరెక్షన్ ఒక్కటే చేస్తే ఓ సినిమా విడుదలైన వెంటనే రెండు వారాల్లో నెక్ట్స్ ఏం చేయాలని అందరూ ప్రెజర్ పెడుతూ ఉంటారు.. కానీ నటుడిగా ఉంటే అలా ఉండదు.

15. ఫలానా అబ్బాయి అమ్మాయి సినిమా గురించి చెప్పండి..?

ఇది 18 ఏళ్ల అమ్మాయి అబ్బాయి కథ. సీనియర్ జూనియర్ తరహా అన్నమాట.. వాళ్లకు 28 ఏళ్లు వచ్చేసరికి కథ ముగుస్తుంది. ఈ పదేళ్లలో ఏం జరిగింది అనేది కథ. ఫ్రెండ్ షిప్‌తో పాటు అన్నీ ఉంటాయి. ఈ గ్యాప్‌లో చదువు పూర్తి కావడం.. అమెరికా వెళ్లి రావడం.. అప్పుడు ఏం జరిగింది అనేది కథ.

16. రీసెంట్‌గా కొన్ని సినిమాలు చూసినపుడు ఇలాంటి ఆలోచనలు మరో సినిమాలో ఉన్నాయి అనిపిస్తాయా..?

అనిపిస్తాయండీ.. చాలాసార్లు అనిపించింది కూడా. ప్రతీ సినిమాకు అలాగే అవుతుంది.. జ్యో అచ్చుతానంద మరో రెండు వారాల్లో రిలీజ్ అనగా.. కపూర్ అండ్ సన్స్ ట్రైలర్ రిలీజ్ అయింది.. కానీ దానికి మా సినిమాకు సంబంధం లేదు. ప్రతీ సినిమాకు ఏదో ఒకటి తగులుతుంది. ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయికి చిచోరే తగిలింది అంటున్నారు కదా.. నేను ఆ సినిమా చూడలేదు.. కథ దానికంటే ముందే డేట్ రిజిష్ట్రేషన్ చేయించాను కూడా.. కాకపోతే వేరే సినిమాల్లోనే కొన్ని సీన్స్ తలిగాయి.. అందుకే కథను కూడా మార్చేసాను.

17. నానితో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు..?

అనుకున్నాం కానీ కొంచెం టైమ్ పడుతుంది... కథేంటి అనేది నాకింకా ఐడియా లేదు. అప్పుడు నాని ఏం సినిమా చేద్దాం అనుకుంటున్నాడు అనేది కూడా తెలియదు. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా.. నాని చేస్తున్న మోహనకృష్ణ గారి సినిమా అయిపోయిన తర్వాత కథ మ్యాచ్ అయితే తొందర్లోనే నానితో సినిమా చేస్తాను.. అప్పటికి నాని మూడ్‌కు నా కథ సెట్ అయితే కాంబినేషన్ వర్కవుట్ అవుతుంది. చూద్దాం.

18. మీరే హీరో.. మీరే డైరెక్షన్ చేస్తారా..?

కష్టం అండీ.. కాకపోతే కథలు రాసే అవకాశం ఉంది.. డైరెక్షన్ అనేది చాలా స్ట్రెస్ ఫుల్ జాబ్.. అలా అన్నీ ఒక్కరే చేయడం కష్టం. ఊహలు గుసగుసలాడే లాంటి జోవియల్ కథకు చేసాను కానీ సీరియస్ పాత్రలకు ఫోకస్ అవసరం.. అన్ని అలా చేయలేం.

19. బాబు బాగా బిజీ తర్వాత అలాంటి సినిమాలు వచ్చాయా..?

రాలేదు.. కానీ అష్టా ఛమ్మా తర్వాత వచ్చాయి.. నాకు ఏడుపొచ్చింది.. బాబు బాగా బిజీ తర్వాత మాత్రం రాలేదు.. హ్యాపీ.

19. ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు.. ఫ్రీ టైమ్ ఏం చేస్తారు.?

మీరు నమ్మరు.. నాకు చాలా ఏళ్లుగా ఫ్రీ టైమ్ లేదు.. ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్.. మరోటి ప్రీ ప్రొడక్షన్.. ఇంకోటి రైటింగ్.. మరోటి డైరెక్షన్.. ఇంకొకటి యాక్టింగ్.. ఇలా ఎప్పుడూ ఏదో వర్క్‌లోనే ఉంటాను. మొన్న ఒక్క సినిమా కోసం 14 వర్షన్స్ అంటేనే దాదాపు 1600 పేజీలు రాసాను. గత నెల రోజుల్లో రెండు రోజులు మాత్రమే ఫ్రీ టైమ్ దొరికింది.. త్వరలోనే నా అసోసియేట్ టీంలో ఒకరు నేను రాసిన కథతో డైరెక్షన్ చేయబోతున్నాడు. వారంలో టైటిల్‌తో సహా చెప్తాను.

20. ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా..?

లేదు.. అసిస్టెంట్ డైరెక్టర్స్ మంచి కథలు చెప్పినపుడు వాటికి నేనేం చేయాలనేది చేస్తుంటాను.. నిర్మాతలకు వినిపించి కాంబినేషన్ సెట్ చేస్తాను.. నేనే డబ్బులు పెట్టాలనేది ఏం లేదు.. ఇక్కడ చాలా మంది ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు.

Avasarala Srinivas Interview about Oorantha Anukuntunnaru:

Avasarala Srinivas Talks about Oorantha Anukuntunnaru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs