Advertisement
Google Ads BL

అనిల్ వర్క్‌కి విజయశాంతి ఫిదా!


మహేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సరిలేరు నీకెవరు చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర చేయడానికి ఆమె చాలానే తీసుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కర్నూలు టౌన్ లో జరగాలి కానీ విజయశాంతి కండీషన్ల వల్ల కర్నూల్ సిటీని 30 ఎకరాల్లో సెట్ వేసి హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో అయితేనే షూటింగ్ చేస్తా అనడంతో ఆమె కండీషన్ మేరకు అనిల్ రావిపూడి లోకల్ గా ఒక తోట లాంటి చోట చక్కని  ఇంటి సెట్ ని రెడీ చేశారు. ఆల్రెడీ ఇల్లు ఉండి పంట పొలం ఉన్నచోట షూటింగ్ స్పాట్ ని ఎంచుకున్నారు.

Advertisement
CJ Advs

విజయశాంతి డిమాండ్స్ అన్నిటినీ అనిల్ సిద్ధం చేశారు. ప్రొడ్యూసర్స్ కూడా ఆమె అడిగింది చేస్తున్నారు. అనిల్ ఒబీడియెన్స్ కి ఉబ్బితబ్బిబ్బయిన విజయశాంతి ఎఫ్ 3కి కూడా సంతకం చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒక ఆర్టిస్ట్ కి డైరెక్టర్ నుండి కంఫర్ట్ ఉంటే ఆ డైరెక్టర్ తో ఎన్ని సినిమాలైనా చేస్తారు. ఇక విజయశాంతి నెక్స్ట్ చిరు - కొరటాల  సినిమాలో నటించనుంది. మరి ఈ మూవీలో ఆమెకి ఇటువంటి సౌకర్యం కుదిరిందా? లేదా అన్నది చూడాలి.

VijayaShanthi Happy with Anil Ravipudi Work:

Vijayashanthi in Anil Ravipudi F3 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs