Advertisement
Google Ads BL

శ్రీవిష్ణు కొత్త సినిమా వివరాలివే..!


‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్’ చిత్రం

Advertisement
CJ Advs

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్.

శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరిలో  ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి.

Sree Vishnu New Movie Details:

Popular Tollywood production houses People Media Factory and Abishek Agarwal Arts are joining hands and bankrolling a new project in Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs