Advertisement
Google Ads BL

అక్కడే కాదు.. ఇక్కడా ‘సైరా’‌కి పోటీ అవుతోంది


సైరా సినిమాకి మిగిలిన భాషల్లో పోటీ లేకపోయినా... బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ ‘వార్’ గండం ఉంది. వార్ సినిమా కూడా సైరాతో పాటుగా రేపే విడుదలవుతుంది. బాలీవుడ్‌లో భారీ హైప్ ఉన్న వార్ సినిమా ఇక్కడ హైదరాబాద్ అంటే నైజాంలోనూ కాస్త క్రేజ్‌తోనే విడుదలవుతుంది. చిరంజీవి సైరా సినిమాకి చాలా చోట్ల ఇంకా బుక్ మై షో లో టికెట్స్ పెట్టలేదు. ఇక వార్ కి హైదరాబాద్‌లో ఓపెనింగ్ డే 200 షోలకి పైగా పడడం, బుక్ మై షో లో వార్ టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి.

Advertisement
CJ Advs

బాలీవుడ్ లోనే సైరాకి వార్ దెబ్బపడింది అనుకుంటే... ఇక్క హైదరాబాద్ లోను వార్ జోరు సైరాకీ గట్టిగా తాకేట్లుగా కనబడుతుంది. వార్ జోరు కొనసాగుతుంటే.. మరో పక్క బెంగుళూరు లాంటి మహానగరాల్లో సైరా టికెట్స్ ఆన్ లైన్ లో పెట్టలేదు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై వంటి నగరంలో మెగా ఫాన్స్ సైరా టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్స్ కోసం కాసుకు కూర్చున్నారు. కానీ మల్టిప్లెక్స్ లలో ఇంకా సై రా టికెట్స్ అందుబాటులోకి రాలేదు. ఈలోపు వార్ సినిమా టికెట్స్ బుకింగ్ ఊపందుకున్నాయి. మరి ఫస్ట్‌డే సైరాకి వార్ దెబ్బ గట్టిగానే పడనుందనిపిస్తుంది.

Chiranjeevi Sye Raa vs Hrithik Roshan War:

War beats Sye Raa in Tollywood also
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs