సై రా నరసింహారెడ్డి సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సినిమా విడుదలకు దగ్గరయ్యాకే సై రా టీం సినిమా ప్రమోషన్స్ ని సుడిగాలి మాదిరిగా.. చెన్నై, బెంగుళూరు అంటూ చుట్టేస్తున్నారు ఈ విషయంలో రామ్ చరణ్ కూల్ గా కనిపిస్తున్నపటికి... సినిమా విడుదలకు దగ్గరయ్యే కొద్దీ చాలా టెంక్షన్ ఫీల్ అవుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరు కూడా ఈ వయసులో ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫ్లైట్ దిగడంతో కాస్త డల్ అయినట్లుగా చెబుతున్నారు. మరోవైపు సై రా ప్రీమియర్స్ విషయంలోనూ సమస్యలున్నట్లుగా టాక్.
యుఎస్ లో భారీ సినిమాల ప్రీమియర్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసు. అయితే సై రా సినిమా విషయంలో ఈ ప్రీమియర్స్ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. యుఎస్ కి క్యూబ్ లు చాలా చోట్లకు ఇప్పటికే చేరుకున్నా.. ఇంకా కొన్నిచోట్లకు వాటిని చేరాల్సి ఉంది. అయితే క్యూబ్ డిస్కులు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా చేరకపోవడం వల్ల కొన్ని చోట్ల సైరా ప్రీమియర్లు క్యాన్సిల్ చేస్తున్నారని చెబుతున్నారు. మంగళవారం 2 గంటలకు పడాల్సిన సై రా ప్రీమియర్లు వేస్తారా.. లేదా... అన్నది ప్రస్తుతం ఉన్న డౌట్. ఈ విషయాలతోనే సై రా బృందం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.