Advertisement
Google Ads BL

‘సమిధ’ టైటిల్ లోగో విడుదల


‘సమిధ’ టైటిల్ లోగోను ఆవిష్కరించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్

Advertisement
CJ Advs

షార్ట్ ఫిలిం మేకింగ్ ద్వారా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులుగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం మరొక షార్ట్ ఫిలిం మేకర్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తున్నారు. ‘మర్మం’, ‘కనులు కలిసాయి’ లాంటి 5 షార్ట్ ఫిలిమ్స్ కి  డైరెక్షన్ చేసి ఇప్పుడు దర్శకుడిగా  పరిచయం అవుతున్నారు  సతీష్ మాలెంపాటి.  ‘సమిధ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో అరుణం ఫిలిమ్స్ బేనర్ పై ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 30 ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ టైటిల్ లోగోను తెలంగాణ సినిమాటోగ్రఫీ మాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా..

దర్శకుడు  సతీష్ మాలెంపాటి  మాట్లాడుతూ  - ‘‘నేను గతంలో ఐదు షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్షన్ చేశాను. అలాగే యాడ్ ఫిలిమ్స్ చేసిన అనుభవం కూడా ఉంది. దాంతో ఇప్పుడు అరుణం ఫిలిమ్స్ బేనర్ లో ఒక మూవీకి దర్శకత్వ భాద్యతలు చేపట్టాను. ‘సమిధ’ టైటిల్ లోగోను నా బర్త్ డే రోజు తలసాని శ్రీనివాస్ గారు అనౌన్స్ చేయడం హ్యాపీగా ఉంది. ‘సమిధ’ అనేది అచ్చ తెలుగు పదం. అన్ని కమర్షియల్ అంశాలతో  కూడిన మంచి కంటెంట్  బేస్డ్ ఫిలిం.  పరిచయం ఉన్న కధానాయకుడితోనే  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. మా సినిమా అన్ని వర్గాల వారిని  ఆక్కట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే మీడియా సమవేశంలో వెల్లడిస్తాను’’ అన్నారు.

Samidha Movie Title Logo Launched:

Telangana Cinematography Minister Sri Talasani Srinivas Yadav Launches Samidha Movie Title Logo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs