Advertisement
Google Ads BL

‘ఊరంతా అనుకుంటున్నారు’ ప్రీ రిలీజ్ హైలెట్స్!


గ్రాండ్ గా ఊరంతా అనుకుంటున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. అక్టోబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Advertisement
CJ Advs

‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకుని ఈ చిత్రం క్లీన్ ‘యు’ స‌ర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న  విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ కృష్ణతో పాటు సుధీర్ బాబు మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ... ఈ పిక్చర్ ట్రైలర్ చూశాను. నవీన్ బాగా యాక్ట్ చేసాడు. సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఊరంతా అనుకుంటున్నారు చిత్రాన్ని విజయ నిర్మలకు అంకితం ఇవ్వడం జరుగుతుంది. నవీన్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

హీరో నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ... నందిని నర్శింగ్ హోమ్ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. డైరెక్టర్ బాలాజీ చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. గ్యాప్ తీసుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేస్తాను. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మా సినిమా మీ అందరికి నచ్చుతుంది.. అన్నారు.

ఆర్టిస్ట్ నరేష్ మాట్లాడుతూ.. విజయ్ నిర్మల గారికి నవీన్ మంచి నటుడు అవ్వాలని ఉండేది. ఆమె అనుకున్నట్లే నవీన్ నందిని నర్శింగ్ హోమ్ సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఊరంతా అనుకుంటున్నారు సినిమాతో నవీన్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరవుతాడని నమ్మకం ఉంది. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న మీడియా, ఆడియన్స్ కు థాంక్స్ తెలిపారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికి బెస్ట్ విషెస్ తెలిపారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ... నవీన్ నాకు ఎడిటర్ గా ఉన్నప్పటి నుండి తెలుసు. ఈ సినిమా కోసం బాగా వెయిట్ తగ్గాడు. నటన అంటే ఇష్టంతో సినిమాల్లోకి వచ్చాడు. తనకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాను.. అన్నారు.

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ... నవీన్ తో వర్క్ చెయ్యడం హ్యాపీగా అనిపించింది. డైరెక్టర్ తాను రాసుకున్న కథను అందంగా తెరకెక్కించాడు. నన్ను ఈ పాత్ర చెయ్యమని చెప్పగానే ఒప్పుకున్నాను. మంచి పాత్రతో మీ ముందుకు వస్తున్నాను అన్నారు.

డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ... నాకు నవీన్ అయితేనే కథకు న్యాయం చెయ్యగలడు అనిపించింది. సినిమా బాగా వచ్చింది. కుటుంభం అందరూ కలిసి చూడగద్ద సినిమా ఊరట అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నరేష్ గారి సపోర్ట్ మరువను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత శ్రీహరి మంగళంపల్లి మాట్లాడుతూ... మా హీరో నవీన్ గారు ఈ సినిమాలో బాగా నటించారు, దర్శకుడు బాలాజీ మంచి కథతో ఈ సినిమా తీశారు. నరేష్ గారు మాకు సహాయ సహకరాలు అందించారు. రాధాకృష్ణ గారి సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. అక్టోబర్ 5న విడుదల కానున్న మా సినిమాను విజయవంతం చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ... ఊరంతా అనుకుంటున్నారు చిత్ర పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఈ చిత్రం. నవీన్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడాని భవిస్తున్నాను. డైరెక్టర్ బాలాజీ ఈ సినిమాను బాగా తీసాడు. అవసరాల శ్రీనివాస్ తో పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.

న‌టీన‌టులు: 

నవీన్ విజయకృష్ణ

శ్రీనివాస్ అవసరాల

మేఘా చౌదరి

సోఫియా సింగ్

జయసుధ

కోటా శ్రీనివాసరావు

రావు రమేష్

అన్నపూర్ణమ్మ

రాజా రవీంద్ర

అశోక్ కుమార్, ప్రభావతి

జబర్దస్త్ రామ్

జబర్దస్త్ బాబి

గౌతంరాజు

అప్పాజీ

క్రాంతి

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వం: బాలాజి సానల

నిర్మాతలు: శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి

సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్

డి.ఓ.పి.     : జి.ఎల్.ఎన్. బాబు

ఎడిటింగ్     : మధు

కొరియోగ్రఫీ  : భాను

మేకప్ : ప్రేమ్ రాజ్

స్టోరీ : శ్రీమంగళం, రమ్య

ఆర్ట్ : కృష్ణమాయ

ఫైట్స్ : రామ్ సుంకర

పాట‌లు: వనమాలి, పెద్దాడ మూర్తి, శ్రీహరి మంగళంపల్లి

కాస్ట్యూమ్ డిజైనర్ : భార్గవీ రెడ్డి

కాస్ట్యూమర్ : నాగరాజు

ప్రొడక్షన్ మేనేజర్ : సుబ్బు ఎస్

పి.ఆర్.ఓ. : వంశీ – శేఖర్

Oorantha Anukuntunnaru Movie Pre Release Event:

Celebrities Speech at Oorantha Anukuntunnaru Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs