Advertisement
Google Ads BL

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ టీజర్‌ రెస్పాన్స్‌తో హ్యాపీ: నిర్మాత


ఫన్నీ డైలాగ్స్‌తో మా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ టీజర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది - నిర్మాత కె.శేఖర్‌రాజు

Advertisement
CJ Advs

జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా వంటి సూపర్‌ హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజు గారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది డా. ఎన్‌.శివ ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. కాగా, ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ టీజర్‌ను శనివారం విడుదల చేశారు.

స్టైలిష్‌ లుక్‌లో సుధీర్‌ ఎంట్రీతో టీజర్‌ స్టార్ట్‌ అయింది. ‘ఐరన్‌ మాన్‌కి అక్కలాగా, డైనోసార్‌ డాటర్‌లా ఉన్నావ్‌ నువ్వు కోచా’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌లో సుధీర్‌ చెప్పే డైలాగ్‌, ‘నీ ఫేస్‌కి గేసే పడరు... దాని గ్రేస్‌ చూశావా..’ అంటే ‘హలో రావుగారు చీపురు చూపించి కేజ్రీవాల్‌గారు సీఎం అయ్యారు, ఛాయ్‌ వాలా దేశానికి పీఎం అయ్యారు నేను ట్రై చేస్తే ఆ అమ్మాయికి బిఎఫ్‌ అవ్వలేనా’, ‘చంద్రబాబు ఇంటూ చంద్రశేఖర్‌రావు ఈక్వల్‌ టూ చందు అని మా ఫ్రెండ్స్‌ అంటుంటారు’ అని చెప్పే డైలాగ్స్‌ చాలా బాగున్నాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.శేఖర్‌రాజు మాట్లాడుతూ - ‘‘మా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ టీజర్‌కి ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా సుధీర్‌ కామెడీ టైమింగ్‌ గురించి మనందరికీ తెలిసిందే.. టీజర్‌లో ఆయన చెప్పే డైలాగ్స్‌కి మంచి అప్లాజ్‌ వస్తోంది. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరిపి ట్రైలర్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు.

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటిస్తున్నారు. నిర్మాత శేఖర్‌రాజు ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, శివప్రసాద్‌, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతమ్‌రాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌, మ్యూజిక్‌: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ఆర్ట్‌ డైరెక్టర్‌: నారాయణ ముప్పాల, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, ప్రొడ్యూసర్‌: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.

Producer Sekhar Raju Talks about Software Sudheer:

Software Sudheer Teaser Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs