Advertisement
Google Ads BL

వెంకీ చేతులమీదుగా 3 మంకీస్ టీజర్


3 మంకీస్ టీజర్ విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

Advertisement
CJ Advs

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కీలక పాత్రల్లో ఓరుగల్లు సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ జి తెరకెక్కిస్తున్న చిత్రం 3 మంకీస్. జబర్దస్త్ కామెడీ షో నుంచి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ టీం ఈ చిత్రంలో తమదైన శైలిలో నవ్వించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలు అద్భుతమైన స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అనుకుంటున్నాను. టీజర్ చాలా నవ్విస్తుంది. 3 మంకీస్ కూడా ఆడియన్స్‌ను అలాగే నవ్విస్తారని అనుకుంటున్నాను. త్వరలోనే ఆడియన్స్ ను కలవడానికి ఈ మూడు కోతులు వస్తున్నాయని తెలిపారు. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. షకలక శంకర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సన్నీ దోమల ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జి అనిల్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ సంస్థలో నాగేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

నటీనటులు:

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, షకలక శంకర్ తదితరులు

టెక్నికల్ టీం:

దర్శకుడు, సంగీతం: జి అనిల్ కుమార్

నిర్మాత: నాగేశ్

నిర్మాణ సంస్థ: ఓరుగల్లు సినీ క్రియేషన్స్

ఎడిటింగ్: ఉదయ్ కుమార్ డి

3monkeys Movie Teaser Released:

Venkatesh Launches 3monkeys Movie Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs