Advertisement
Google Ads BL

టాలీవుడ్ లెజెండ్స్‌పై ‘డబ్ స్మాష్’లో సాంగ్ విడుదల


వి.త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్ స్మాష్ సాంగ్ విడుదల సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని లెజెండ్స్ మీద ఈ పాట ఉండడం విశేషం. ఈ పాటను సినీ నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర్ ప్రసాద్, రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా నిర్మాత ఓంకార లక్ష్మీ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. నవంబర్‌లో ఈ సినిమా మొదలు పెట్టామని నాన్న చెప్పారు. మా అన్నయ్య ఈ సినిమాలో నటించినందుకు హ్యాపీగా ఉంది. హ్యాపీడేస్ తరహాలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికి ధన్యవాదాలు తెలిపారు.

లిరిక్ రైటర్ బాల వర్ధన్ మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు నమస్కారం. అందరూ ఈ సినిమాను కలిసి ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సినిమా పాట ఈ చిత్రంలో హైలెట్ కానుంది. ఈ పాట రాసే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం, అందుకు దర్శకుడికి ధన్యవాదాలు చెప్పాలి. అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 

డైరెక్టర్ కేశవ్ దేవుర్ మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగు సినిమా లెజెండ్స్ మీద పాట మా సినిమాలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది టెక్నీషియన్స్ ను ముందుగా కలిసి ఈ సినిమాను చెయ్యమని అడిగాను, ఆ తరువాత నిర్మాతను కలిసి ఈ సినిమా కథ చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ మీద వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మా సినిమా స్టూడెంట్స్ చేసే డబ్ స్మాష్ వల్ల ఏం జరిగింది అన్నేదే ఈ సినిమా కథాంశం. ఈ సీనిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా  ఉంటుంది. డబ్ స్మాష్ తో పరిచయం అయ్యి, డబ్ స్మాష్ వల్ల పాపులర్ అయిన జంట ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అన్నీ పాటలు బాగా వచ్చాయి, ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 

ఎస్.వి.ఎన్ రావు మాట్లాడుతూ.. డబ్ స్మాష్ చిత్రంలో నటించిన నటీనటులు అందరికి బెస్ట్ విషెస్, దర్శకుడు కేశవ్, నిర్మాత లక్ష్మీకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. వీరు ఇలాంటి మంచి చిత్రాలు భవిషత్తులో మరిన్ని తియ్యాలని కోరుకుంటున్నా.. అన్నారు.

హీరో పవన్ కృష్ణ మాట్లాడుతూ.. వచ్చిన అతిథులకు, మీడియా వారికి ధన్యవాదాలు. మా చిత్ర నిర్మాతలు, దర్శకులు కష్టపడి ఈ సినిమాను తీశారు. ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాను. పాటలు సినిమాలో చాలా బాగా ఉంటాయి. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ సుప్రజ మాట్లాడుతూ.. ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

సహా నిర్మాత గజేంద్ర మాట్లాడుతూ.. మేము చిన్న సినిమా అయినా సరే ప్యాషన్‌తో తీసాము. మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.. అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. టైటిల్ బాగుంది. హనెస్ట్ గా ఈ సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది. సినిమా లెజెండ్స్ మీద పాట చెయ్యాలనే ఆలోచన రావడం, అది చక్కగా ఈ సినిమాలో కుదరడం బాగుంది. కంటెంట్ బాగుంటే సినిమా విజయం సాధిస్తుంది. ఈ మూవీ యూత్ ఫుల్ గా ఎంటర్టైనర్ గా ఉండబోతోందని భావిస్తున్నానని తెలిపారు.

నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా క్వాలిటీతో తీశారు. సినిమా ప్రముఖుల మీద చిత్రీకరించిన సాంగ్ కొత్తగా ఉంది. చిన్న సినిమాను అవగాహనతో అన్నీ తెలుసుకొని చేస్తే విజయం సాధిస్తుంది. ఈ మూవీ అదే తరహాలో ఉంటుందని అనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. చిన్న సినిమాలే ఈ మధ్య విజయం సాధిస్తూ ఉన్నాయి. ఈ సినిమా మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా ప్రేక్షకులు ఈ మూవీని ఆధారిస్తారని, ఈ చిత్రంలో పని చేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

నటీనటులు:

గెటప్ శ్రీను, పవన్ కృష్ణ (హీరో), సుప్రజ (హీరోయిన్)

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: కేశవ్ దేవుర్

నిర్మాత: ఓంకార లక్ష్మీ 

సహా నిర్మాత: గజేంద్ర తిరకాల

కెమెరామెన్: ఆర్.రమేష్

మ్యూజిక్: వంశీ

ఎడిటర్: గ్రేసన్

ఫైట్స్: ఫైర్ కార్తిక్

లిరిక్స్: బాల వర్ధన్

కాస్ట్యూమ్స్: డయానా

మేకప్: రామ్ మోహన్

ప్రొడక్షన్ మేనేజర్: మారుతి ప్రసాద్

కథ, మాటలు: ఏ.వి.రావ్

వి.ఎఫ్.ఎక్స్:మహిందిరన్

పి.ఆర్.ఓ: సాయి సతీష్

అసోసియేట్ డైరెక్టర్: సుబ్రమణ్యం, లోకేష్ పెరత్తుర్

Dubsmash Movie Song Released:

Song on Telugu Movie Legends in Dubsmash Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs