ఇదేంటి నిన్నగాక మొన్న రిలీజ్ అయిన ‘వాల్మీకి’ అలియాస్ ‘గద్దలకొండ గణేష్’ అప్పుడే బుల్లితెరపై వస్తోందా..? అని ఆశ్చర్యపోతున్నారేమో.. అదేం కాదండోయ్.. అదేనండి జబర్దస్త్ షోలో కమెడియన్ హైపర్ ఆదీనే గద్దలకొండ గణేష్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఏ సినిమాల్లో అయితే మంచి విషయం ఉంటుందో అందులో చిన్న పాత్రను తన రూపంలో బయటపెడుతుంటాడు ఆది. ఇప్పుడు గద్దలకొండ గణేష్ సినిమా జనాలకు బాగా ఎక్కడంతో ఆ పాత్ర చేయాలని జబర్దస్త్ షో వేదికగా పెద్ద హంగామానే చేశాడు.
అచ్చం వరుణ్ తేజ్‌లాగా ఆది దిగిపోయాడు. నెట్టింట్లో ఈ గెటప్‌కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ స్కిట్‌లో ఆదితో పాటు రోహిణి కూడా కనిపిస్తోంది. అసలే ఆదికి ‘పంచ్‌లరాయుడు’ అని పేరుంది.. ఈ స్కిట్‌లో మాత్రం మరింత డోస్ పెంచి మరీ హంగామా చేశాడు. ఈయనతో పాటు మిగిలిన వాళ్లు కూడా అదిరిపోయే పంచ్ డైలాగులతో దుమ్ము దులిపేసారని చెప్పుకోవచ్చు.