Advertisement
Google Ads BL

‘సైరా’ ట్రైలర్‌‌పై వర్మ ఎలా రియాక్టయ్యాడంటే...!!


టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏ పనిచేసినా ఇండస్ట్రీలో హాట్ టాపికే.. అదో సెన్సేషనే. సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయాలన్నా.. ఇంటర్వ్యూలో చిత్ర విచిత్రాలుగా సమాధానాలు చెప్పాలన్న ఆర్జీవీ తర్వాతే ఎవరైనా.. ఆయన చెప్పే విషయాలు ఆయనకే అతికినట్లు సరిపోతుంటాయ్.. అంతేకానీ జనాలు మాత్రం లెక్కచేయరు. ఇక ఇవన్నీ పక్కనెడితే.. ప్రస్తుతం యావత్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే రిలీజైన లుక్స్ మొదలుకుని టీజర్, ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకుంది. అంతేకాదు డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఇప్పటికే సినిమా చూసేసి తమ అభిప్రాయాలను కూడా చెప్పేశారు.

Advertisement
CJ Advs

తాజాగా విడుదలైన ‘సైరా’ ట్రైలర్‌పై ఆర్జీవీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఆ ట్రైలర్‌పై వర్మ పాజిటివ్‌గా స్పందించడం విశేషమని చెప్పుకోవచ్పు. అంతేకాదు.. చిరంజీవికి తగ్గ సినిమా చేశాడు.. రామ్‌చరణ్‌ సో గ్రేట్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు ఆర్జీవీ. ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు, మెగాభిమానులు ఒకింత షాకయ్యారట. ఎందుకంటే ఎప్పుడూ మెగా ఫ్యామిలీపై వివాదాస్పద ట్వీట్స్ చేసే ఆర్జీవీ సడన్‌గా ఇలా మారిపోయాడేంటి.. ఓహో మార్పు మన మంచికే అని ఫిక్సయ్యి ఇలా చేశారేమో అని అభిమానులు అనుకుంటున్నారు. మరోవైపు.. అసలింతకీ ఇది వర్మనే ట్వీట్ చేశాడా..? లేదా అని ఒకటికి పదిసార్లు నెటిజన్లు రీ చెక్‌ చేసుకున్నారట.

RGV Reaction About Sye Raa Narasimha Reddy:

<h1 class="title style-scope ytd-video-primary-info-renderer">RGV Reaction About Sye Raa Narasimha Reddy</h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs