మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించిన నటించిన చిత్రం ‘సైరా’. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించగా.. చిరు తనయుడు రామ్‌చరణ్ నిర్మించారు. అక్టోబర్-02న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో మెగాభిమానులు, సినీ ప్రియులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. అయితే.. పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలకు మాత్రం ఇంతవరకూ ఓ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. సైరా సినిమాలో పవన్ వాయిస్ ఓవర్‌కే పరిమితమా లేకుంటా పాత్ర ఏమైనా చేశారా..? ఒకవేళ ఏదైనా పాత్రలో చేసుంటే దాన్ని గోప్యంగా ఉంచారా..? అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు.
ఇప్పటికే.. టీజర్‌లో పవన్ వాయిస్ ఉన్నది.. పవన్ చెప్పింది పది సెకన్ల వాయిస్ అయినా గూస్‌బంప్సే. అయితే పవన్ దీనికే పరిమితమా లేదా.. వాయిస్ ఇంకా ఉందా అనే విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు క్లైమాక్స్‌లో నరసింహారెడ్డిని ఉరితీసి ఆయన తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి బ్రిటీష్‌వారు వేలాడదీస్తారట. ఈ క్రమంలో ‘ఉయ్యాలవాడ’ పోరాటం ఇతరుల్లో ఎలా స్ఫూర్తి నింపిందనే సన్నివేశాలను ఒకట్రెండు కాదు.. సుమారు 15 నిమిషాల పాటు సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ 15 నిమిషాలపాటు సన్నివేశాలకు పవన్ వాయిస్ ఓవరే ఉంటుందట. అంతేకానీ పవన్ పాత్ర మాత్రం ఏమీ లేదని సమాచారం. ప్రతిష్టాత్మకంగా చిత్రం కావడంతో పవన్ వాయిస్‌ను తీసుకోవాలని దర్శకుడు సురేంద్రకు.. చిరు సూచించారట. అందుకే దర్శకనిర్మాతలకు పవన్‌ను సంప్రదించి వాయిస్ అడగడం.. ఆయన కాదనుకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట.