Advertisement
Google Ads BL

‘సైరా చిరంజీవా’ అంటున్న అక్షత శ్రీనివాస్


చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘అభిలాష’ ఆ అమ్మాయి పేరు.  మరో సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ఆమె క్యారక్టర్. ఇక మెగా స్టార్ చిరంజీవి అంటే అభిలాషకు ఎంత పిచ్చి అంటే.. ‘జై చిరంజీవా’ అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత.  ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? ‘గ్యాంగ్ లీడర్’ గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ‘సురభి 70 ఎం.ఎం’ చూడాల్సిందే అంటున్నారు దర్శకనిర్మాత వై.గంగాధర్. 

Advertisement
CJ Advs

మెగా ఫ్యాన్ గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న ‘సురభి 70 ఎం.ఎం’ చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్-అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  యువ ప్రతిభాశాలి వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. ‘సురభి 70 ఎం.ఎం’ అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్ తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె ‘గ్యాంగ్ లీడర్’ ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్సకనిర్మాత వై.గంగాధర్. 

మెగా ఫ్యాన్ అభిలాషగా నటిస్తున్న యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘స్వతహా మెగాస్టార్ కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు ‘సురభి 70 ఎం.ఎం’ లో మెగాభిమానిగా గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత కల ‘అభిలాష’ అనే పాత్రలో ‘లేడి గ్యాంగ్ లీడర్’ గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకుగాను మా దర్శకనిర్మాత గంగాధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా చెప్పగలను. మా బాస్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ‘సైరా’ సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు!!

Akshaha Srinivas Starrer Surabhi 70 MM Movie Update:

Akshaha Srinivas Is Mega Star Chiranjeevi Fan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs