లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. నటన పరంగా సూపర్ హిట్టయిన ఈమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇంతవరకూ పాస్ అవ్వలేకపోతోంది. అందుకే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే పలువురి ప్రేమలో పడి నిలువెత్తునా మోసపోయిన ఈ భామ.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో నయన్ ప్రేమాయణం సాగిస్తోంది. అంతేకాదు ఒక్క భారత్‌లోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ లవ్ బర్డ్స్ విహరిస్తున్నాయి.
అయితే వీరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కొందరేమో ఇప్పటికే పెళ్లయిపోయిందని.. మరికొందరేమో ఇప్పుడు కాదు పెళ్లయ్యి కూడా రెండేళ్లు అయ్యిందని.. మరికొందరు మాత్రం అబ్బే అదేం లేదు.. త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నారని చెప్పుకుంటున్నారు.. ఇందుకు సంబంధించిన వార్తలు సైతం హల్ చల్ చేస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. డిసెంబర్ 18న లేదా 19న పెళ్లి పీటలు ఎక్కడానికి ఈ ప్రేమ జంట సిద్ధమైందట. నయన్ మాత్రం తొందరెందుకు అని అంటుండగా.. విఘ్నేష్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారట. ప్రస్తుతం సినిమాలతో నయన్ బిజీగా ఉండటంతో డిసెంబర్ కాస్త గ్యాప్ వస్తుందని.. ఆ గ్యాప్‌లో పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తోందట. ప్రస్తుతం వీరి పెళ్లి వ్యవహారం కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే మరి.