Advertisement
Google Ads BL

రజినీ కోసం మహేశ్ త్యాగం చేస్తున్నారా!


సినీ ఇండస్ట్రీలో సినిమాల విషయంలో పోటాపోటీ ఉన్నప్పటికీ నటీనటీమణులంతా మంచి స్నేహబంధాలు కొనసాగిస్తుంటారు. ఒక్కోసారి సర్దుకుపోయే విషయంలో ఒకరికొకరు చెప్పకుంటూ ముందుకెళ్తుంటారు. ఇప్పుడు కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ కోసం.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదెలాంటి నిర్ణయమంటే రజినీ కోసం ఏకంగా తన సినిమా రిలీజ్‌నే ఆపేసి.. డేట్ మార్చేసుకునేంతగా.

Advertisement
CJ Advs

వాస్తవానికి తెలుగు ప్రజలు గ్రాండ్‌గా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్‌లో సినిమాలు పోటాపోటీగా రిలీజ్ చేసేస్తుంటారు. ఈ లిస్ట్‌లో మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ను జనవరి 11న, అల్లుఅర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో..’ 12న, రజనీ నటించిన ‘దర్బార్’ 10 న విడుదల చేయాలని ఆయా సినిమాల దర్శకులు ప్లానింగ్స్ చేస్తున్నారు. అయితే కాస్త డేట్స్ విషయంలో కాస్త అటు ఇటు ఉండొచ్చేమోగానీ రిలీజ్ అయితే పక్కాగా పొంగల్‌కే.

అయితే రజనీకాంత్‌తో పోటీ పడటం ఎందుకులే అని అనుకున్నారో..? లేకుంటే పెద్దాయనకు గౌరవం ఇచ్చి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారో..? లేదా ఒకరికొకరు మ్యూచువల్ అండర్‌స్టాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నారో..? తెలియదు కానీ.. జనవరి 11న మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ చేయొద్దని.. జనవరి 14న రిలీజ్ చేద్దామని దర్శకనిర్మాతలకు మహేశ్ సూచించారట. అంటే ఆ సూపర్ స్టార్ కోసం.. ఈ సూపర్‌ స్టార్ ఒక్క అడుగు వెనక్కి తగ్గి త్యాగం చేస్తున్నారన్న మాట. అయితే ఇందులో నిజానిజాలెంతున్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Mahesh Babu Takes Key Decisions For Rajinikanth!:

Mahesh Babu Takes Key Decisions For Rajinikanth!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs